వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం పగులగొట్టకుండా, పాస్‌కోడ్ ఉపయోగించి రూ.26 లక్షలు దోచుకెళ్లారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎం నుంచి ఎంతో తెలివిగా రూ.26 లక్షలు దోచుకెళ్లారు. ఏటీఎం పగులగొట్టకుండా పాస్‌కోడ్ ఉపయోగించి వారు ఈ దొంగతనం చేయడం గమనార్హం.

ఈ సంఘటన ఢిల్లీలోని సీలాంపూర్ ప్రాంతంలో జరిగింది. ఏటీఎం నుంచి ఇలా డబ్బులు పోవడం ఈ జిల్లాలో గత ఎనిమిది నెలల్లో ఇది మూడోసారి. ఈ దొంగతనం విషయాన్ని శనివారం రాత్రి గుర్తించారు. ఏటీఎం పని చేయడం లేదని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశారు. అప్పుడు బ్యాంకు అధికారులకు ఏం జరిగిందో తెలిసింది.

Two men make off with Rs 26 lakh from ATM

దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకొని పోలీసులు, బ్యాంకు అధికారులు విస్తుపోయారు. ఏటీఎం సెంటర్లోకి వచ్చి క్యాష్ పెట్టిన బాక్స్‌కు ఉన్న పాస్‌వార్డ్‌ ద్వారా దొంగలు డబ్బును దోచుకున్నారు. ఆ పాస్‌వార్డ్‌ ద్వారా బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న దాదాపు 26 లక్షలకు పైగా నగదును తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టగా పాస్‌వార్డ్‌ తెలియడం వల్లే దొంగతనం జరిగిందని ప్రాథమిక నిర్ధారించారు.

ఇందులో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. ఏటీఎంలో నగదు నింపే ఉద్యోగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏటీఎంలో క్యాష్‌బాక్స్‌ పాస్‌వార్డ్‌ కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇది బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉండదని చెబుతున్నారు.

English summary
Two unidentified men allegedly siphoned off Rs 26 lakh from a private bank’s ATM kiosk in Seelampur. This is the third incident in the same district in the last eight months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X