వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : కశ్మీర్‌లో నక్కిన ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంతలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో .. సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

తనిఖీలు చేస్తుండగా కాల్పులు ..
సోషియాన్ జిల్లా అవ్‌నీరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు ఇవాళ ఉదయం పోలీసులను చూసి అప్రమత్తమయ్యారు. వెంటనే కాల్పులు ప్రారంభించారు.

Two militants killed in gunfight in Kashmirs Shopian

దీంతో ప్రతీగా సిబ్బంది ఎదురుకాల్పులు చేశారు. భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని సయద్ అహ్మద్ భట్, షకీర్ అహ్మద్ వాగేగా గుర్తించారు. అహ్మద్ భట్ సనావుల్లాహ్ కుమారుడని తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు అన్సార్ గజ్వాతుల్ హింద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు మీడియాకు వివరించారు.

కూంబింగ్ ..
ఎన్‌కౌంటర్ తర్వాత కూడా ఆ ప్రాంతంలో తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గతేడాది కన్నా ఈ సారి కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల పెరిగాయని ఇటీవల కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఉగ్రవాదుల అలజడి కలకలం రేపుతోంది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు .. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

English summary
two militants were killed on Tuesday in a gunfight between the security forces and holed up militants in Jammu and Kashmir's Shopian district. The encounter started late Monday evening. Both the militants are reportedly locals. The search operation is currently underway. Police sources said two militants were killed today in a pre-dawn encounter in Awneera village of Shopian district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X