వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తేరుకోకముందే మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..

|
Google Oneindia TeluguNews

రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఇదో బిగ్ షాక్. గుజరాత్‌లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. కర్జన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షయ్ పటేల్,కప్రద అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జితూ చౌదరి రాజీనామాలు సమర్పించినట్టు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడిగా.. తాజాగా మరో ఇద్దరు వీడటంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 73 నుంచి 66కి పడిపోయింది.

సంఖ్యా బలాన్ని చెరో రెండు.. కానీ..

సంఖ్యా బలాన్ని చెరో రెండు.. కానీ..

ఈ నెల 19న మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గుజరాత్‌ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంఖ్యా బలాన్ని బట్టి బీజేపీ,కాంగ్రెస్‌లకు చెరో రెండు రాజ్యసభ స్థానాలు దక్కేవి. కానీ బీజేపీ మూడో రాజ్యసభ స్థానం కూడా కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి.. వారితో రాజీనామా చేయించడం ద్వారా పార్టీకి రాజ్యసభ స్థానాలు దక్కకుండా చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ముగ్గురిని బరిలో నిలిపిన బీజేపీ..

ముగ్గురిని బరిలో నిలిపిన బీజేపీ..

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. శక్తిసింహ గోహిల్,భరతసింహ సోలంకిలను పోటీలో నిలిపింది. అటు బీజేపీ మాత్రం ముగ్గురు అభ్యర్థులను పోటీలో నిలపడం గమనార్హం. రమీలా బరా,అభయ్ భరద్వాజ్,నరహరి అమిన్‌లను ఆ పార్టీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు వెళ్లాలంటే ఆ పార్టీకి అసెంబ్లీలో కనీసం 70 ఓట్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్యాబలం 66కి పడిపోవడంతో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎన్సీపీకి ఉన్న ఒక ఎమ్మెల్యే,భారతీయ ట్రైబల్ పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతునిచ్చినా కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు రాజ్యసభకు వెళ్లడం అసాధ్యమే.

మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..

మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..

గుజరాత్‌ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీవి కాగా ఒకటి కాంగ్రెస్ పార్టీది. తిరిగి ఇప్పుడు ఆ 3 స్థానాలను తామే దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ తమవైపుకు తిప్పుకుని రాజీనామాలు చేయిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితోనే వారు రాజీనామాలు చేస్తున్నారని చెబుతోంది. అంతేకాదు,మున్ముందు మరింతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడే అవకాశం ఉందని బీజేపీ నేత నరహరి అమిన్ బాంబు పేల్చారు.'కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తమ షాపును తెరిచి పెట్టుకుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, డబ్బును,అధికారాన్ని బీజేపీ ఎన్నికల్లో గెలుపు కోసం దుర్వినియోగం చేస్తోంది.' అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత పరేష్ ధనాని ఆరోపించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ప్రస్తుత బీజేపీ బలం 103,కాంగ్రెస్ బలం 66,బీటీపీ బలం 2,ఎన్సీపీ 1గా ఉంది.

Recommended Video

COVID-19 : 198 Types Of Corona Viruses Found In India!
19న రాజ్యసభ ఎన్నికలు

19న రాజ్యసభ ఎన్నికలు


ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇటీవలే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 24 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో ఆంధ్రప్రదేశ్,గుజరాత్,కర్ణాటకల నుంచి 4,మధ్యప్రదేశ్,రాజస్తాన్‌ల నుంచి 3,జార్ఖండ్ నుంచి 2,మణిపూర్,మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్,మిజోరాంల నుంచి ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Gandhinagar: In a major setback for the opposition Congress, two party legislators in Gujarat have resigned ahead of the June 19 Rajya Sabha elections for four seats from the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X