బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus:బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు, మొత్తం 13, US, Spain యువతి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19 ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షా 97 వేల మందికి చేరింది. ఇప్పటికే కరోనా వైరస్ తో 8, 131 మంది మరణించారు. కర్ణాటకలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటకలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13కు చేరిందని, ఈ వ్యాధిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు. Spain నుంచి వచ్చిన 25 ఏళ్ల యువతికి, USA నుంచి బెంగళూరు వచ్చిన 56 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో వెలుగు చూసిందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పష్టం చేశారు.

Coronavirus:నిన్న చైనా అధ్యక్షుడిపై కేసు, నేడు సీఎంపై ఫిర్యాదు, ప్రజలు ప్రాణాలతో గేమ్స్ !Coronavirus:నిన్న చైనా అధ్యక్షుడిపై కేసు, నేడు సీఎంపై ఫిర్యాదు, ప్రజలు ప్రాణాలతో గేమ్స్ !

అమెరికా అంకుల్, స్పెయిన్ అమ్మాయి !

మార్చి 6వ తేదీన అమెరికా నుంచి 56 ఏళ్ల వ్యక్తి బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోనే నివాసం ఉంటున్న ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు దృవీకరించారు. 25 ఏళ్ల యువతి స్పెయిన్ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకుంది. స్పెయిన్ నుంచి వచ్చిన యువతికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు దృవీకరించారు.

ఆర్యోగ శాఖ మంత్రి క్లారిటీ !

ఆర్యోగ శాఖ మంత్రి క్లారిటీ !

అమెరికా నుంచి 56 ఏళ్ల బెంగళూరు వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు దృవీకరించారని, స్పెయిన్ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్న 25 ఏళ్ల యువతికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు దృవీకరించారని, వారిద్దరికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పష్టం చేశారు.

కర్ణాటకలో 13 కరోనా కేసులు

కర్ణాటకలో 13 కరోనా కేసులు

కర్ణాటకలో ఇప్పటి వరకు 13 కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో కలబురిగిలో మహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే వ్యక్తి మరణించాడు. మక్కా యాత్ర ముగించుకుని సౌదీ మీదుగా కర్ణాటక వచ్చిన మహమ్మద్ హుసేన్ సయ్యద్ కరోనా వైరస్ వ్యాధితోనే మరణించాడని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశంలోనే మొదటి కారోనా చావు !

దేశంలోనే మొదటి కారోనా చావు !

భారతదేశంలో ఇప్పటి వరకు 150 కరోనా వ్యాధి కేసులు నమోదైనాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు దేశంలో 147 కరోనా కేసులు నమోదైనాయని స్వయంగా అధికారులు ప్రకటించారు. అయితే ఉదయం తరువాత కొత్తగా నమోదైన 3 కరోనా కేసుల వివరాలు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే కరోనా వైరస్ వ్యాధితో ఎప్పుడు ఏం జరుగుతుందో ? అనే భయంతో ప్రజలు హడలిపోతున్నారు. మరో వైపు కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ప్రభుత్వాలు ఆ వ్యాధికి వీలైనంత వరకు అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

English summary
Two more Coronavirus (COVID 19) positive cases have been reported in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X