బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూ దుకాణంలో కొంటారా?: ముస్లిం యువతులకు వేధింపులు, బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందువుల దుకాణంలోకి వెళ్లిన ముస్లిం మహిళలపై కొందరు ముస్లిం యువకులు దూషణలకు దిగారు. వారిని వేధింపులకు గురిచేశారు. ఈ ధారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

దావణగెరెలో బుర్ఖా ధరించిన ఇద్దరు ముస్లిం మహిళలు ఓ దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశారు. అయితే, హిందువులకు చెందిన దుకాణంలో ఎందుకు బట్టలు కొనుగోలు చేశారంటూ సదరు ముస్లిం యువతులపై కొందరు ముస్లింలు వేధింపులకు దిగారు. దుస్తులు కొనుగోలు చేసిన సంచులను వారి చేతుల్లో నుంచి బలవంతంగా లాక్కుని వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Two Muslim women targeted by Muslim men for buying clothes from Hindu-owned shop

ఏదైనా అవసరం ఉంటే ముస్లింల దుకాణాల్లోనే కొనాలని.. హిందువుల దుకాణంలో ఎందుకు కొంటున్నారని యువతులను దూషించారు. వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ వారిని బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బీజేపీ నేత శోభా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కర్ణాటక లేదా ఇతర ఇస్లామిక్ దేశమా? హిందువుల దుకాణంలో కొన్నందుకు ఆ దుండగులు ముస్లిం మహిళలను బెదిరిస్తారా? ఇలా మతపిచ్చి పట్టిన తీవ్రవాదులకు భారత చట్టాల రుచి చూపించాలి అని ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు .

English summary
In a shameful incident, two Muslim women were harassed by some men of the Muslim community for buying clothes from a Hindu’s shop in Karnataka’s Davangre. The video of the incident has gone viral on various social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X