వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్: ఇద్దరు నావికా సిబ్బంది మృతి

|
Google Oneindia TeluguNews

కొచ్చి: భారత నావికా దళానికి చెందిన ఓ గ్లైడర్ విమాన వాహక నౌక కూలింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. కేరళలోని కొచ్చిన నావికా స్థావరానిిక సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సంబంధిత అధికారుల వివరాల ప్రకారం.. రోజువారీ విధుల్లో భాగంగా ఐఎన్ఎస్ గరుఢ నుంచి ఓ శిక్షణా పవర్ గ్లైడర్ ఆదివారం ఉదయం టేకాఫ్ అయ్యింది. చక్కర్లు కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా తొప్పుంపాడి బ్రిడ్జికి సమీపంలో కుప్పకూలింది.

Two Navy personnel dead as a glider on routine flight crashes in Kochi

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అందులో ఉన్న లెఫ్టినెంట్ రాజీవ్ ఝా, పెట్టీ ఆఫీసర్ సునీల్ కుమార్‌ను హుటాహుటిన ఐఎన్‌హెచ్ఎస్ సంజీవనికి తరలించారు. అప్పటికే వారివురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Recommended Video

Kerala Driver Car Parking Video | Man Behind This Sensation || Oneindia Telugu

ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. లెఫ్ట్‌నెంట్ ఝా(39) ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెట్టీ ఆఫీసర్ కుమార్(29) బీహార్‌లోని భోజ్‌కు చెందినవారు.

English summary
A glider aircraft of Indian Navy crashed near Kochi Naval Airport on Sunday morning, critically injuring an officer and sailor on board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X