వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబాకు షాక్: జీవితఖైదు విధించాలని కోర్టుకు బాధితులు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు మరో షాక్ తగిలింది. రామ్ రహీమ్ సింగ్‌కు విధించిన శిక్ష సరిపోదని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఛంఢీఘడ్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు మరో షాక్ తగిలింది. రామ్ రహీమ్ సింగ్‌కు విధించిన శిక్ష సరిపోదని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

తప్పుడు ఆరోపణలు, కూతురుగా తండ్రి కోసం సేవ చేశా: హనీప్రీత్తప్పుడు ఆరోపణలు, కూతురుగా తండ్రి కోసం సేవ చేశా: హనీప్రీత్


డేరా సఛ్చా సౌధ చీఫ్ రామ్ రహీమ్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. రామ్ రహీమ్ సింగ్ జైలుకు వెళ్ళిన నాటి నుండి ఆయన లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

తప్పుడు ఆరోపణలు, కూతురుగా తండ్రి కోసం సేవ చేశా: హనీప్రీత్తప్పుడు ఆరోపణలు, కూతురుగా తండ్రి కోసం సేవ చేశా: హనీప్రీత్

డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‌ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. సుమారు 40 రోజులుగా హనీప్రీత్ సింగ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగింది.

డేరా సచ్చా సౌధలో చోటుచేసుకొన్న ఘటనలపై హనీప్రీత్ నుండి మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఈ తరుణంలోనే డేరా బాబాకు షాక్ ఇచ్చే ఘటన చోటుచేసుకొంది.

జీవిత ఖైదును విధించాలని కోరిన బాధితులు

జీవిత ఖైదును విధించాలని కోరిన బాధితులు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాచీఫ్ గుర్మీత్ సింగ్‌కు బాధిత సాధ్విలు మరో సారి షాక్ ఇచ్చారు. అతడికి విధించిన 20 ఏళ్ల జైలు శిక్ష సరిపోదన్నారు. ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష విధించాలంటూ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. 2002లో అత్యాచారానికి గురైన ఇద్దరు సాధ్విలు బుధవారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు.

Recommended Video

Gurmeet Ram Rahim Singh : సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే | Oneindia Telugu
డేరా బాబాకు చుక్కలు చూపిస్తున్న బాధితులు

డేరా బాబాకు చుక్కలు చూపిస్తున్న బాధితులు

డేరా ఆశ్రమంలోని సాధ్విలపై గుర్మీత్ సింగ్ అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చిన పంచకుల ప్రత్యేక కోర్టు అతడికి 20 యేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసును బాధితులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. డేరాబాబాకు చిక్కకుండా ఇంతకాలం పాటు వారు మనగలిగారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసినందుకుగాను రామ్ రహీమ్ సింగ్‌కు ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్మీత్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే బాధిత సాధ్విలు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

గుర్మీత్‌కు చెక్ పెట్టేందుకేనా?

గుర్మీత్‌కు చెక్ పెట్టేందుకేనా?

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబా రామ్ రహీమ్ సింగ్‌కు చెక్ పెట్టేందుకే ఇద్దరు సాధ్వీలు మళ్ళీ కోర్టును ఆశ్రయించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ డేరా బాబా కోర్టును ఆశ్రయించడంతో బాధితులు కూడ కోర్టును ఆశ్రయించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 4. హనీప్రీత్ నోరు విప్పేనా?

4. హనీప్రీత్ నోరు విప్పేనా?

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డేరా బాబాకు సంబంధించిన కీలక సమాచారాన్ని హనీప్రీత్ నుండి చెప్పించాలని పోలీసులు భావిస్తున్నారు. అసలు డేరా సచ్ఛా సౌధలో సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు హనీప్రీత్‌తో సరిపోల్చుకొనే అవకాశాలున్నాయి. డేరా ఆశ్రమంలో ఆస్థిపంజరాలు ఇతరత్రా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ విషయాలపై ఆరా తీసే అవకాశం ఉంది. పోలీసు కస్టడీకి తీసుకొని హనీప్రీత్‌ను ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

English summary
Two women followers raped by the Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh moved the Punjab and Haryana High Court on Wednesday, seeking life imprisonment for the sect head, who was sentenced to 20 years in prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X