వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో దారుణం: బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువుల హత్య

|
Google Oneindia TeluguNews

లక్నో: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో మరో దారుణం జరిగింది. మంగళవారం దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు సాధువులను దారుణంగా హత్య చేశాడు.

టంగ్స్(పటకారు) దొంగతనం చేశావంటూ దూషించడంతో మురళి అనే నిందితుడు ఇద్దరు సాధువులు జగదీష్ దాస్(55), షేర్ సింగ్(45)లను దేవాలయంలోనే హత్య చేశాడు. పగౌనా గ్రామంలోని ఓ ఆలయంలో ఆ ఇద్దరు సాధువులు నివాసం ఉంటుండగా ఈ దారుణం జరిగింది.

మద్యంమత్తులో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దేవుడి కోరిక ప్రకారమే తాను ఆ ఇద్దరు సాధువులను చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం.

Two sadhus in Bulandshahr ‘beaten to death’ by man

మంగళవారం ఉదయం హత్యకు గురైన ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చేతిలో కత్తితో తిరుగుతున్న నిందితుడు మురళీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు గంజాయి కూడా తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు సాధువులను కత్తితో పొడిచిన నిందితుడు, ఆ తర్వాత కర్రలతో కొట్టి చంపాడని బులంద్‌షహర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. సాధువులను హత్య చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు.

గత 15ఏళ్లుగా జగదీష్, ఐదేళ్లుగా షేర్ సింగ్ దాస్‌లు ఈ ఆలయంలోనే ఉంటున్నారు. కాగా, సాధువుల ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీలను ఆదేశించారు.

English summary
Two sadhus were murdered, allegedly by a man who they had accused of stealing a chimta (tongs), in Bulandshahr on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X