• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్ర‌ధాని..అమిత్ షాతో క‌లిసి.. ఆ ఇద్దరు తెలుగు అధికారులు: జ‌మ్ము కాశ్మీర్‌పై నిర్ణ‌యాల వెనుక‌..!

|

యావ‌త్ దేశ‌మే కాదు..ప్ర‌పంచం మొత్తం భార‌త్ వైపు చూసేలా చేసిన ఘ‌ట‌న తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు..జ‌మ్ముకాశ్మీర్ రెండుగా విభ‌జ‌న‌.ఈ నిర్ణ‌యాలు ప్ర‌ధాని మోదీ..హోం మంత్రి అమిత్‌షా తీసుకున్న‌వే అయినా..ఇది కార్యాచ‌ర‌ణ‌లోకి రావటానికి..క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది మాత్రం ఇద్ద‌రు తెలుగు అధికారులు. వారి స్వ‌స్థ‌లం ఇద్ద‌రిదీ ఏపీనే. అందులొ ఒక‌రు జ‌మ్ము కాశ్మీర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుబ్ర‌మ‌ణ్యం. మ‌రో అధికారి కేం ద్ర న్యాయ శాఖ‌లో కీల‌క అధికారి బి నారాయ‌ణ రాజు. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులను ముందుండి నడిపించిన సుబ్ర‌మ ణ్యం తెగువ చూసి, ఆయనను జమ్మూకశ్మీర్‌ సీఎస్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. దేశ చరిత్రలోనే అతి కీలక మైన ఘట్టంలో ముఖ్య భూమిక పోషించిన ఇద్దరు అధికారులూ తెలుగు వారే.

అజిత్ ధోవ‌ల్‌కు న‌మ్మ‌క‌స్తుడిగా సుబ్ర‌మ‌ణ్యం..

అజిత్ ధోవ‌ల్‌కు న‌మ్మ‌క‌స్తుడిగా సుబ్ర‌మ‌ణ్యం..

జ‌మ్ము కాశ్మీర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్త‌న్న సుబ్ర‌మ‌ణ్యం నేపథ్యం, బంధువర్గం అంతా విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. ఢిల్లీ కళాశాలలో ఆయన ఇంజనీరింగ్‌ చదివారు. అమెరికాలోని వార్టన్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని ప్రపంచబ్యాంకు కార్యాలయంలో పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు అధికారిణి ఉమాదేవినిపెళ్లి చేసుకున్నారు. త‌మ రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు..అక్కడి కుట్రలు, ఉగ్రవాద వ్యూహాలన్నింటినీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు చేరవేసేవారు. కొన్ని నెలల క్రితం ప్రారం భమైన జమ్మూకశ్మీర్‌ ఆపరేషన్‌కు అవసరమైన సలహాలు, పైనుంచి వచ్చే ఆదేశాలను మూడోకంటికి తెలియకుండా అమలు చేయగలిగారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వద్దకు ప్రత్యేక కార్యదర్శిగా వెళ్లిపోయారు. నాలుగేళ్లపాటు ఆ హోదా లో పనిచేశారు. ఆ తర్వాత నరేంద్రమోదీ కూడా ఆయన సమర్థతను గుర్తించి ఏడాదిపాటు ప్రధానమంత్రి కార్యాల యంలో జాయింట్‌ సెక్రటరీ హోదాలో ఉంచారు.

అర్టిక‌ల్ 370 ర‌ద్దు గెజిట్ రూప‌క‌ల్ప‌న‌లో నారాయ‌ణ‌రాజు..

అర్టిక‌ల్ 370 ర‌ద్దు గెజిట్ రూప‌క‌ల్ప‌న‌లో నారాయ‌ణ‌రాజు..

కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ్ము కాశ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ముందుగానే వ్యూహం సిద్దం చేసుకున్న కేంద్రం తొలుత ప్ర‌ధాని నివాసంలో జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకొని వెంట‌నే రాష్ట్రప‌తి ఆమోదానికి నివేదించింది. దీంతో..రాజ్య‌స‌భ‌లో అమిత్ షా ప్ర‌క‌ట‌న చేస్త‌న్న స‌మ‌యంలోనే రాష్ట్రప తి ఉత్త‌ర్వులు..ఆ వెంట‌నే గెజిల్ విడుద‌ల అయ్యాయి. ఇక‌, ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్‌ రూపకల్పన లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జి.నారాయణరాజు కీల‌కం. 1990 దశకంలో నారాయణరాజు భీమవరం డీఎన్నార్‌ లా కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. అక్కడ పని చేస్తూనే ప్రభుత్వ న్యాయవిభాగంలో ఉద్యోగం పొం దా రు. 2015 నుంచి లెజిస్లేటివ్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ పలు చట్టాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నా రు. కీల‌క‌మైన బిల్లులో ఎక్క‌డా న్యాయ ప‌రంగా చిక్కులు రాకుండా..ఆమోదించ‌టం ఆ వెంట‌నే కీల‌క‌మైన గెజిట్ విడుద‌ల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ‌లుకు మార్గం సుగ‌మం అయింది.

 మోదీ..షా..థోవ‌ల్‌..ఈ ఇద్ద‌రు..

మోదీ..షా..థోవ‌ల్‌..ఈ ఇద్ద‌రు..

కొద్ది రోజులుగా జ‌మ్ము కాశ్మీర్‌లో ఏదో జ‌రుగ‌బోతోంద‌నే సంకేతాలు..చ‌ర్చ‌లు కేవ‌లం ప్ర‌ధాని మోదీ...హోం మంత్రి అమిత్ షా..జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడికి మాత్ర‌మే ఏ నిర్ణ‌యం అమ‌లు చేయేబోతోంది తెలుసు. రెండు రోజుల ముందుగా మాత్రం రాష్ట్రప‌తి..ఉప రాష్ట్రప‌తికి ప్ర‌ధాని నివేదించారు. అయితే,ఈ ప్ర‌ముఖుల‌తో పాటుగా ఈ తెలుగు అధికారుల‌కు మాత్ర‌మే ఈ వ్య‌వ‌హారం పైన స‌మాచారం ఉంది. వారు సైతం ప్ర‌ధాని..షా సూచ‌న‌ల మేర‌కు ప‌క్కాగా అధికారిక ప్ర‌క్రియ పూర్త‌య్యేలా అత్యంత ర‌హ‌స్యంగా త‌మ వంతు ప‌ని పూర్తి చేసారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో ఇద్ద‌రు తెలుగు అధికారుల కీల‌క పాత్ర పైన అటు అధికారుల వ‌ద్ద ..సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two senior Officers native of Andhra was play key role in abolish of article 370 and Jammu Kashmir re organisation act. One of both officers is Jammu Kashmir CS Subramnyam and other one is Law Deptmt officer Narayana Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more