వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవానుల మృతి

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారత్‌పై పై చేయి సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. దీంతో పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యను తీసుకెళ్లడంతో పాటు భారత సరిహద్దు ప్రాంతంలో పలుసార్లు కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఒక పౌరుడు మృతి చెందాడు.

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కాల్పులు జరపడంతో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఒక పౌరుడు మృతి చెందాడు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని దీంతో జిల్లాలోని పలు గ్రామాలు సైతం దాడుల్లో దెబ్బతిన్నాయని భారత అధికారులు తెలిపారు.

Two soldiers and one civilian have been killed in Jammu and Kashmir

గత వారం రోజుల క్రితమే ఎల్‌ఓసీ వెంట ఉన్న బారముల్లా, మరియు రాజౌలి ప్రాంతంలో కాల్పులు విరమణ ఉల్లంఘించింది. భారత ఆర్మిపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు మృతి చెందారు.

కాగా జూలైలో 296 సార్లు, ఆగస్టులో 307 సార్లు సెప్టెంబర్‌లో 292 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్దంగా వ్యవహరించారని మొత్తం మీద గత సంవత్సరం నుండి 2050 సార్లు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు జరగగా మొత్తం 21 మంది ప్రజలు మృతి చెందినట్టు భారత అర్మి అధికారులు ప్రకటించారు. అయితే పాకిస్తాన్ క్వింపు చర్యలకు భారత అధికారులు కూడ పలుసార్లు తీవ్రంగా స్పందించినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టడం లేదు.

English summary
Two soldiers and one civilian have been killed in Jammu and Kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X