కలకలం: మమతా ఇంటి ముందు మావోయిస్టుల సంచారం, ఆయుధాలు సీజ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి సమీపంలో మావోయిస్టులు(నక్సల్స్) తిరుగుతూ కన్పించడం స్థానికంగా కలకలం రేపింది. కోల్‌కతాలోని హరీశ్ ఛటర్జీ వీధిలో గల సీఎం నివాసం ముందు సోమవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించారు.
వారిని గమనించిన పోలీసులు వెంటనే అరెస్టు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులను విచారించగా.. వారు మావోయిస్టు గ్రూప్‌కు చెందిన వారిగా తెలిసింది. తాము సీఎం ఎదుట లొంగిపోయేందుకు వచ్చామని వారు పోలీసులకు తెలిపారు.

కాగా, వారి వద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి. వాటిని పోలీసులకు అందజేశారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు ఓ సీనియర్ పోలీసుల అధికారి తెలిపారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. మమత బెనర్జీ జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications