వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో పాక్ గూడఛారుల అరెస్ట్?

|
Google Oneindia TeluguNews

భారత్ - పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైన్యం అదుపులోకి తీసుకుంది. అరెస్టైన ఇద్దరూ పాకిస్థాన్ గూఢచారులై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు ఇద్దరు వ్యక్తులు ఆర్మీ క్యాంప్, దాని పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియో తీస్తున్నట్లు గుర్తించారు.

వెంటనే అప్రమత్తమై జవాన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపుకి తీసుకుని ప్రశ్నించారు.ఫొటోలు, వీడియో తీసిన వ్యక్తుల్లో ఒకరు కథువా, మరొకరు దొడా ప్రాంతానికి చెందిన వారని పోలీసుల విచారణలో తేలింది. ఆర్మీ క్యాంపు ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించగా సరైన జవాబు రాలేదు. దీంతో పోలీసులు వారిద్దరి సెల్‌ఫోన్లు తీసుకుని పరీక్షించారు.

Two suspected spies arrested near jammu army camp

నిందితులిద్దరూ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టుకు కొన్ని గంటల ముందు భారత్‌లో పలు ప్రాంతాలకు చెందిన వీడియోలను పాక్‌లో కొందరికి పంపినట్లు తేలింది. అరెస్టైన ఇద్దరూ పాక్ గూఢచారులా కాదా అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

English summary
Two persons, suspected to be spying for Pakistan, were arrested Tuesday while they were shooting videos and taking photographs outside an Army camp here, officials said. The suspected spies were handed over to the police and are being questioned at a joint interrogation centre, the officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X