వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కిన ఇద్దరు జైషె ఉగ్రవాదులు: మరో దాడికి సన్నాహాలు చేశారా? మొబైల్ ఫోన్ లో కీలక సమాచారం

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశంలో పుల్వామా తరహాలో మరో దాడికి కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల చేతికి చిక్కారు. వారిద్దరికీ పాకిస్తాన్ ప్రేరేపిత భయానక ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లా దేవ్ బంద్ ప్రాంతంలో వారిద్దరూ పోలీసులకు దొరికారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, వారిని అరెస్టు చేశారు. రెండు మారణాయుధాలు, బుల్లెట్లతో నిండి ఉన్న క్యాట్రిడ్జ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారి వినియోగిస్తున్న సెల్ ఫోన్లలో కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని వీడియో క్లిప్పులు, ఫొటోలు, మ్యాపులు ఉన్నట్లు తేలింది. వారికి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనే విషయాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇద్దరి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ కు చెందినవారే. జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ కు చెందిన షానవాజ్, పుల్వామాకు చెందిన అకిబ్ గా గుర్తించారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత వారు కనిపించకుండా పోయారు.

two suspected terrorists were caught from Saharanpur in Uttar Pradesh

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ దాడి తరహాలోనే మరో భారీ పేలుడుకు కుట్ర పన్నినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. దేవ్ బంద్ లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో వారు కొద్దిరోజులుగా నివసిస్తున్నారని అన్నారు. షానవాజ్ అనే ఉగ్రవాది గ్రనేడ్లను తయారు చేయడంలో నిపుణుడని చెప్పారు. పుల్వామాపై ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న రోజున వారిద్దరూ జమ్మూకాశ్మీర్ ను విడిచి వెళ్లినట్లు విచారణ సందర్భంగా వెల్లడైందని అన్నారు.

two suspected terrorists were caught from Saharanpur in Uttar Pradesh

పుల్వామా తరహాలోనే మరిన్ని దాడులు చేయడానికి భారీ ఎత్తున పేలుడు సామాగ్రిని సమకూర్చుకుంటున్నారనే విషయం స్థానికుల ద్వారా తెలిసిందని అన్నారు. ఇద్దరి వయస్సు 20-25 సంవత్సరాల మధ్యన ఉంటుందని చెప్పారు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా దేవ్ బంద్ లోని ప్రైవేటు వసతి గృహంపై దాడి, చేసి ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు ఓపీ సింగ్ తెలిపారు. వారికి ఎక్కడి నుంచి? ఎవరెవరి నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై విచారణ చేపట్టామని ఓపీ సింగ్ అన్నారు. షానవాజ్, అకిబ్ తమకు పట్టుబడిన సమాచారాన్ని జమ్మూకాశ్మీర్ పోలీసులకు తెలియజేశామని అన్నారు. వారి నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు.

English summary
A team of Uttar Pradesh Anti Terrorist Squad (ATS) conducted a midnight raid on Thursday and busted a terror module of Jaish-e-Mohammed, the state Director General of Police OP Singh said on Friday. The raid was conducted on a private hostel of Deoband in Saharanpur district and seven persons were detained for questioning. The two detained men are from Jammu and Kashmir, the DGP said adding that they are in “20-25 years” age group. “Yesterday after inputs two suspected terrorists were caught from Saharanpur by our ATS wing. They are linked to JeM and both are from Kashmir. Shahnawaz is from Kulgam and Aqib is from Pulwama. Two weapons and live cartridges seized,” Singh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X