వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేదికపై డీజే హోరు, స్టేజీ సమీపంలో కుప్పకూలిన మ్యూజిక్ లవర్స్.. ఇద్దరిదీ ఏపీనే..

|
Google Oneindia TeluguNews

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం చోటుచేసుకుంది. డీజే హోరులో, సింగర్స్ ఊపు తెచ్చే పాటలు పాడుతుండగా మ్యూజిక్ లవర్స్ హోరెత్తిపోయారు. అయితే ఇద్దరు మాత్రం నేలమీద పడిపోయారు. ఆస్పత్రి తీసుకెళ్లేలోపు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

గోవా నార్త్ జిల్లా వెగటూర్ బీచ్ సమీపంలో శుక్రవారం సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌ నిర్వహించారు. మధ్యాహ్నాం ఫెస్ట్ ఔత్సహికులతో నిండిపోయింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయి ప్రసాద్, వెంకట్ కూడా ఉన్నారు. డీజే పాటలు హోరులో ఉండగా.. వారు కూడా డ్యాన్సులేస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక్కసారిగా పడిపోవడం కలకలం రేపింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Two tourists from Andhra Pradesh die after collapsing at Sunburn festival..

సాయి ప్రసాద్, వెంకట్ స్టేజీ సమీపంలో ఉన్నారు. వారికి తిప్పడంతో మ్యూజిక్ షో నుంచి బయటకు వచ్చేందుకు బయటకొస్తున్నారు. గేట్ ఓపెన్ చేసేందుకు కోసం నిరీక్షించారు. తర్వాత అక్కడే పడిపోవడంతో సిబ్బంది వారిని మపుజాలోని అజిలో ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. వారి మృతికి గల కారణాలు అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని, ఇప్పుడే ఏం చెప్పలేమని పోలీసులు చెప్తున్నారు. అటాప్సీ నివేదిక వచ్చాక ఏం జరిగిందనే అంశంపై క్లారిటీ ఇస్తామని తెలిపారు.

English summary
two music enthusiasts from Andhra Pradesh who were visiting Goa to participate in the ongoing Sunburn Electronic Dance Music festival died after collapsing near the venue in North Goa district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X