వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగార మంత్ర: ఆ మొక్కలో ఏముంది బాసూ...జనం అంతలా కొట్టుకుంటున్నారు..?

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లో ఓ మొక్క కోసం రెండు ఊళ్లు కొట్టుకున్నాయి. ఇదేంటి చిన్న మొక్క కోసం ఊళ్లు కొట్టుకుంటాయా అనే అనుమానం మీకు కలగొచ్చు. కానీ ఇది నిజం. ఈ గ్రామాలు పితోర్ఘడ్ జిల్లాలో ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే పితోర్ఘడ్ జిల్లాలోని దార్చులా మరియు మున్స్యారీ గ్రామ ప్రజలు వేసవి సమయంలో గొడవ పడుతూ ఉంటారు. ఇది తొలిసారిగా జరుగుతున్న ఘర్షణ కాదు. ప్రతి వేసవి సమయంలో ఈ గొడవలు ఆ గ్రామస్తుల మధ్య జరగడం సహజం.ఇంతకీ వీరు గొడవ పడుతున్న ఆ మొక్కలో ప్రత్యేకత ఏముంది.. ఒక మొక్కకోసమే ప్రాణాలు తీసేసుకుంటారా..?

Two Uttarakhand villages fight over Himalayan viagra, section 145 imposed

హిమాలయా పర్వత ప్రాంతంలోని పితోర్ఘడ్ జిల్లాకు చెందిన దార్చులా మరియు మున్స్యారీ గ్రామ ప్రజలు ఎత్తెన పర్వత ప్రాంతంలో ఉన్న పశ్చిక బయలుకు వెళతారు. అదేదో సరదాకోసం కాదండీ. అక్కడ పండే ఓ మొక్క కోసం ఇరు గ్రామ ప్రజలు అక్కడికి వెళతారు. ఆ మొక్క పేరు కీడా జాడీ. దీన్నే హిమాలయా వయాగ్రా అనికూడా పిలుస్తారు. వయాగ్రా అంటే శృంగారంలో అధిక శక్తిని ఇచ్చేందుకు సాధారణంగా వాడుతారు. కానీ ఈ హిమాలయా వయాగ్రా తీసుకుంటే శృంగారంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారని అక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. అందుకే ఈ కీడాజాడీ మొక్కకు అంతర్జాతీయ మార్కెట్లో యమ డిమాండ్. ఇది ఒక్క హిమాలయాల్లో తప్ప ఎక్కడా పండదు. ఈ మొక్కలను కోసేందుకు రెండు గ్రామ ప్రజలు పోటీ పడుతారు. అప్పుడప్పుడు ఘర్షణకు కూడా దిగుతారు.

Two Uttarakhand villages fight over Himalayan viagra, section 145 imposed

ఈ మొక్క కోసం గొడవలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆ మొక్కలు పండే పశ్చిక బయలు తమ గ్రామ పరిధిలోకి వస్తుందంటూ ఇతరులకు ప్రవేశం లేదంటూ రెండు గ్రామ ప్రజలు చెబుతున్నారు. మళ్లీ దీనిపై కూడా గొడవకు దిగి తలలు పగలగొట్టుకుంటున్నారు. అంతేకాదు అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా ఇద్దరు సంయమనం పాటించి సమస్య జటిలం కాకుండా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. కానీ వీరు ఏమాత్రం తగ్గడం లేదు. గొడవలు అలానే జరుగుతుండటంతో పోలీసులు 145 సెక్షన్ అక్కడ విధించారు.

ఇక హిమాలయా వయాగ్ర పండే ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందంటే లేదు మా పరిధిలోకి వస్తుందని చెబుతూ మున్స్యారీ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఆర్‌సీ గౌతమ్‌ను కలిశారు. దీంతో ఆ గ్రామస్తులను రెవిన్యూ డివిజనల్ అధికారి కలిసి మాట్లాడారు. ఆయన ముందే గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో ఇక చేసేది ఏమీ లేక పోలీసులు 145 సెక్షన్‌ను విధించారు.

English summary
Two villages in Himalayan region of Uttarakhand state fight for a himalayan viagra which is found in the meadows. This himalaya viagra has a high demand in international market. Police imposed section 145 in this area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X