వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్‌కు రూ. 23000 జరిమానా ....!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన చట్టం సవరణ అమలు వాహానదారులకు చుక్కలు చూపిస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుండి అమలైన కొత్త నిబంధనలు కొన్ని రాష్ట్రాల్లో అమలుతుండగా మరికొన్ని రాష్ట్రాలు దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే నూతన చట్టాన్ని అడాప్ట్ చేసుకున్న ఢిల్లీ ప్రభుత్వం మొదటి రోజే 4000 వేల చలాన్లను విధిస్తే... ఏకంగా హర్యాణ ట్రాఫిక్ పోలీసులు ఓ టూవీలర్ వాహనదారుడికి నూతన చట్టప్రకారం చుక్కలు చూపించారు.

 కొత్త మోటారు చట్టాన్ని అమలు చేస్తున్న హర్యణ,ఢిల్లీ

కొత్త మోటారు చట్టాన్ని అమలు చేస్తున్న హర్యణ,ఢిల్లీ

రెండు రోజుల క్రితం కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారువాహన చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది. దీంతో వాహనాదారులపై నూతన జరిమానాలు విధిస్తోంది. ఇందులో బాగంగానే సోమవారం ఓ ఢిల్లీ బేస్‌డ్ టూవీలర్ వాహనదారుడికి పలు నిబంధనల క్రింద జరిమానాలు విధించింది. గురుగ్రామ్ జిల్లా కోర్టు ఎదురుగా ఓ స్కూటితో వస్తున్న వ్యక్తిని చెక్ చేసిన పోలీసులు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ,పోల్యూషన్, డ్రైవింగ్ విత్ ఆవుల్ హెల్మెంట్ తోపాటు ధర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ లేక పోవడం గమనించారు.

5 నిబంధన క్రింద రూ.23000

5 నిబంధన క్రింద రూ.23000

ఈనేపథ్యంలోనే 1, పోల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా నడిపినందుకు రూ.10,000 2, రిజిస్ట్రేషన్ లేకపోవడంతో రూ.5000 3,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు రూ.5000 4,హెల్మెంట్ లేనందుకు రూ.2000 5,ధర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేనందుకు రూ.1000 ఇలా మొత్తం అయిదు నిబంధనల క్రింద మొత్తం 23000 రుపాయాలను జరిమానను విధించారు.

రహదారి భద్రతపై కేంద్రం నూతన చట్టం

రహదారి భద్రతపై కేంద్రం నూతన చట్టం

రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదాలు, మరణాల నియంత్ర కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారువాహానాల చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ సవరణ బిల్లు సెప్టెంబర్ ఒకటి నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఇందుకోసం కేంద్రం నోటిఫికేషన్ కూడ విడుదల చేసింది. అయితే ఈ చట్టం అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద అధారపడి ఉంటుంది. ఈనేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్నాయంటూఈ చట్టాన్ని అమలు పరించేదుకు నిరాకరించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టంపై చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం.

English summary
A day after the newly-amended Motor Vehicles Act came into effect on September 01, a Delhi-based two-wheeler owner was fined a whopping Rs 23,000 in the NCR town of Gurugram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X