వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు భార్యల ముద్దులమొగుడు, నిన్న గెలిచాడు, నేడు భార్యలను గెలిపించుకున్నాడు, పండగే పండగ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రైతుకు నిజ జీవితంలో పంటపడింది. ఇంత కాలం ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు రాజకీయాల్లో ఉన్నాడు. అయితే డిసెంబర్ 27, 30వ తేదీ జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు భార్యలను పోటీ చేయించి వారిని గెలిపించుకున్న భర్త ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇన్ని రోజులు తనను ఇంట గెలిపించిన ఇద్దరు భార్యలను ఈ రోజు అతను వారిని ఇంట బయట ఎన్నికల్లో గెలిపించి వారం ముందుగానే సంక్రాంతి పండుగ జోరుగా జరుపుకుంటున్నాడు.

నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!

రైతు, రాజకీయ నాయకుడు

రైతు, రాజకీయ నాయకుడు

తమిళనాడులోని తిరువున్నామలై జిల్లాలోని వందవాసి సమీపంలో ధనశేఖరన్ నివాసం ఉంటున్నాడు. ధనశేఖరన్ వ్యవసాయం చేస్తున్నాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పంచాయితీ చైర్మన్ పదవికి పోటీ చేసిన ధనశేఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించి రాజకీయ నాయకుడు అయ్యాడు.

ఇద్దరు భార్యల ముద్దులమొగుడు

ఇద్దరు భార్యల ముద్దులమొగుడు

ధనశేఖరన్ కు సెల్వీ, కాంచన అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పంచాయితీ మండలి చైర్మన్ గా ఎన్నికైన ధనశేఖరన్ రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే ఎన్నికల్లో వాల్వూర్ వందవాసి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓ భార్య సెల్వీ పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యింది.

భార్యకు గ్రామంలో పట్టు

భార్యకు గ్రామంలో పట్టు

ధనశేఖరన్ మరో భార్య కాంచనాకు ఆమె సొంత ఊరు కోవిల్ గుప్పం సతానూర్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఆ గ్రామంలో కాంచనా కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువ. ఈ ఎన్నికల్లో కాంచనా తన సొంత గ్రామం అయిన కోవిల్ గుప్పం సాతనూరులో పోటీ చేశారు. కాంచనా భారీ మెజారిటీతో ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

మొగుడు పెళ్లామ్స్ అదుర్స్

మొగుడు పెళ్లామ్స్ అదుర్స్

ధనశేఖర్ కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఇద్దరు భార్యలు సెల్వీ, కాంచనా విజయం సాధించడంతో వారి ఇంటిలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలైనాయి. ఇంట గెలిచి రచ్చ గెలిచిన ధనశేఖరన్ ఇప్పుడు ఇద్దరు భార్యలను ఎన్నికల్లో గెలిపించుకుని తిరువున్నామలై జిల్లాలో హాట్ టాఫిక్ గా నిలిచాడు.

ఓటర్లు మా దేవుళ్లు

ఓటర్లు మా దేవుళ్లు

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ధనశేఖరన్ దంపతులను వారి అనుచరులు గజమాలలతో సత్కరించి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ధనశేఖరన్, ఆయన ఇద్దరు భార్యలు సెల్వీ, కాంచనా మీడియాతో మాట్లాడుతూ తమ మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లు దేవుళ్లతో సమానం అని, వారి అన్ని సమస్యలు పరిష్కరించడానికి తాము ఎప్పుడు సిద్దంగా ఉంటామని అన్నారు.

English summary
Tamil Nadu local body election result: two wifes of ex-chairman won seats near vandhavasi in Thiruvannamalai district in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X