వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల దర్శనం వివాదం, బీజేపీకి అనుకూలం, పోరాటానికి మద్దతు, హిందూ వ్యతిరేక ప్రభుత్వం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sabarimala Row : శబరిమల వివాదం బీజేపీకి అనుకూలంగా మారేలా ఉందా ? | Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలో శబరిమల అయ్యప్పస్వామిని మహిళలు దర్శనం చేసుకోరాదని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేరళ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని పలు బీజేపీతో సహ పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కావాలనే రచ్చ

కావాలనే రచ్చ

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం పెద్దది చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కేరళ ప్రభుత్వ తీరు బీజేపీకి అనుకూలంగా మారితే పరిస్థితి వేరుగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల్లో లాభం !

ఎన్నికల్లో లాభం !

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం వియంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలం అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం బీజేపీకి అనుకూలంగా మరే అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు.

పక్క రాష్ట్రాల దెబ్బ

పక్క రాష్ట్రాల దెబ్బ

ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేరళ చేరుకుని ఆందోనళలో పాల్గోంటున్నారు. కేరళలో శబరిమల అయ్యప్పస్వామిని మహిళలు దర్శించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం రోజురోజుకూ ఉదృతం కావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

యూపీ సీఎం ఎంట్రీ

యూపీ సీఎం ఎంట్రీ

ఇదే సందర్బంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సమావేశం కేరళలో ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీ కర్ణాటక సరిహద్దులోని కాసరగూడులో నిర్వహిస్తున్న హిందూ సమాజోత్సవం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గోంటున్నారు.

బలప్రదర్శన ?

బలప్రదర్శన ?

కాసరగూడులోని విద్యానగర్ నగరసభ క్రీడామైదానంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు కేరళతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్, పలు హిందూ సంఘ సంస్థల కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కేరళలో జరుగుతున్న పోరాటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ, హిందూ సంఘ సంస్థలు భావిస్తున్నాయని సమాచారం.

English summary
UP Chief Minister Yogi Adityanath going to visit Kasaragod, Kerala On December 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X