వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉబేర్ డ్రైవర్ రేప్: పెదవి విప్పిన బాధితురాలు, పోలీసులు గ్రేట్..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ డిసెంబర్ 5, 2014న ఓ 25 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ పైన అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె గుర్గావ్ నుండి తన ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయమై బాధితురాలు తొలిసారి పెదవి విప్పారు. ఇలాంటి విషయాల పైన మౌనం వహించడం సరికాదని చెప్పారు.

ఆమె ఓ ఆంగ్ల పత్రికలో దీనిపై రాశారు. ఇలాంటి చేదు అనుభవం తనకు ఎప్పుడు జరుగుతుందనుకోలేదని, ఇక్కడ తాను ఫెయిల్ అయ్యానని చెప్పారు. ఈ చేదు అనుభవం నేపథ్యంలో తాను సరిగా నిద్ర కూడా పోవడం లేదని, ఒంటరిగా బయటకు వెళ్లడమంటేనే భయం వేస్తోందని చెప్పారు.

ఏదైనా తప్పు జరిగితే తాను దానిని గట్టిగా వ్యతిరేకిస్తానని, తాను ఈ సంఘటన పైన మాట్లాడుతానని, తన కుటుంబం, స్నేహితులు వ్యతిరేకించినప్పటికీ మాట్లాడుతానని చెప్పారు. అందుకే తాను ఆ సంఘటన జరగగానే తాను మొదట తన తల్లిదండ్రులకు కాకుండా, పోలీసులకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు.

Uber cab rape survivor breaks silence

ఉబేర్ క్యాబ్ డ్రైవర్ మహిళల్ని బెదిరించేందుకు డిసెంబర్ 16, 2012 గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకుంటున్నాడని, తాను లొంగకపోతే ఐరన్ రాడ్ ఉపయోగించవలసి వస్తుందని హెచ్చరించే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పారు. ఆమె ఢిల్లీ పోలీసులను కొనియాడారు.

రాజధాని పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారని, నిందితుడిని పట్టుకున్నారని, అందుకు వారిని ఎంతో అభినందిస్తున్నట్లు ఆమె చెప్పారు.

తాను ఈ విషయమై కేసు ఫైల్ చేయడంపై కొందరు ఇప్పటికే తమను వేధించేలా మాట్లాడుతున్నారన్నారు. తన తల్లి స్నేహితురాలు ఒకరు తన తల్లితో మాట్లాడుతూ... కేసు పెట్టడంతో మీరు బద్నాం అయ్యారని వ్యాఖ్యానించిందని, అందుకు తన తల్లి ధీటుగానే సమాధానం చెప్పిందన్నారు.

English summary
The young executive raped in an Uber cab on December 5, 2014, when she was returning from Gurgaon has broken her silence, fighting back — bitter, but determined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X