వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 ఏళ్ల వ్యక్తితో పాటు తీహార్ జైలు సెల్‌లో శివకుమార్ యాదవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్‌పై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జ్యుడిషిటల్ కస్టడీపై ఉన్న అతన్ని తీహార్ జైల్లో పెట్టారు. శివ కుమార్ యాదవ్‌పై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు, భద్రతను పెంచినట్లు తీహార్ జైలు వర్గాలు చెప్పాయి.

యాదవ్‌కు కోర్టు శుక్రవారం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతన్ని హై సెక్యూరిటీ ప్రిజన్‌లోని పదో వార్డులోని 18వ నెంబర్ సెల్‌లో ఉంచారు. జైలు నుంచి శుక్రవారం బయటకు తీసుకుని రాగానే 32 ఏళ్ల శివ కుమార్ యాదవ్‌కు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా శివ కుమార్ యాదవ్‌పై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు, భద్రతను పెంచినట్లు జైలు అధికారులు పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. అతను మరో ముగ్గురితో పాటు ఆ సెల్‌లో ఉంటున్నాడు. ఆ ముగ్గురిలో ఓ 70 ఏళ్ల ఖైదీ కూడా ఉన్నాడు. శివకుమార్ యాదవ్ ప్రవర్తనను పరిశీలించినట్లు, అతను అసాధారణంగా ఏమీ కనిపించలేదని జైలు అధికారి ఒకరు చెప్పారు.

 Uber rape accused kept under strict vigilance

గత శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది.

నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

English summary
Uber rape accused Shiv Kumar Yadav who has been sent to Delhi's Tihar jail in judicial custody, has been kept under strict vigilance here. Tihar jail sources said that continuous watch is being kept on Yadav and security has been enhanced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X