వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓలాకు షాక్: జపాన్ కంపెనీతో ఉబెర్ బిగ్ డీల్.. వాటా కొనుగోలు!

ఉబెర్-జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ డీల్ ఎట్టకేలకు ఓకె అయింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కార్పోరేట్‌ గవర్ననెన్స్‌, న్యాయపరమైన చిక్కుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఉబెర్-జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ డీల్ ఎట్టకేలకు ఓకె అయింది. ఉబెర్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మేరకు దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే ఉబెర్ వాటాను సాఫ్ట్ బ్యాంకు కొనుగోలు చేయడానికి సిద్దమైంది. తర్వాతి కాలంలో దాదాపు 14శాతం వాటాను సాఫ్ట్ బ్యాంకు కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Uber seals multibillion-dollar investment from Softbank

కాగా, గత అక్టోబర్ నెలలోనే ఉబెర్-సాఫ్ట్ బ్యాంకు డీల్ ఫైనల్ కావాల్సి ఉంది. కానీ కార్పోరేట్ గవర్నెన్స్, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇంతకాలంగా అది వాయిదా పడుతూ వచ్చింది. సోప్ట్ బ్యాంక్ డ్రాగోనియర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియంతో ఒక ఒప్పందం కుదిరిందని ఉబెర్ ధ్రువీకరించింది.

విదేశాల్లో తమ సేవలను విస్తరించడానికి ఇది దోహదపడుతుందని ఉబెర్ తెలిపింది. గతంలో సాఫ్ట్ బ్యాంకు సంస్థ ఓలా, ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ లోను పెట్టుబడులు పెట్టింది. అయితే నష్టాలను మాత్రమే మూటగట్టుకుంది. ఓలా ప్రత్యర్థి ఉబెర్ లో సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
Japanese technology conglomerate SoftBank has reached a deal with Uber to invest billions in the ride-hailing giant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X