వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్దవ్, ఫడ్నవీస్ భాయి భాయి : ఓకే వేదికపై నేతలు, కలిసే పోటీ చేస్తామనే సంకేతాలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో పోలింగ్ సమీపిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో తాము కలిసి ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే వేదికను పంచుకొన్నారు. తాము కలిసే ఉన్నామని .. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ఇండెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చారు. మహారాష్ట్ర పోలింగ్‌కు మరో నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పొత్తులపై క్లారిటీ రాలేదు.

 మరోసారి మేమే ..

మరోసారి మేమే ..

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇందులో ఏమాత్రం సందేహానికి తావులేదన్నారు. మరోవైపు మతాదీల నేతకు రాజ్యాధికారం వస్తోందని చెప్పారు శివసేన చీఫ్ ఉద్దవ్. ఇటీవల మాతాధి నేత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. మతాది నేత అన్నాసాహెబ్ పాటిల్ జయంతి కార్యక్రమంలో థాకరే, ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతాదీ నేతలకు టికెట్లు ఇవ్వడమే కాదు గెలిపించుకుంటామని స్పష్టంచేశారు థాకరే.

అండ దండ

అండ దండ

మతాది కులస్తులకు అండగా ఉంటామని వేదికపై హామీనిచ్చారు సీఎం ఫడ్నవీస్. ఇప్పటిలాగే మతాదిలకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మీ ఆశీర్వాదాల వల్ల మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే .. థాకరే, తాను కలిసి మతాది కార్యకర్తల సంక్షేమానికి పాటుపడతామని హామీనిచ్చారు. ఈ వేదికపై రెండు భాగస్వామ్య పక్షాలు మాత్రం పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ-శివసేన భాగస్వామ్య పక్షంలో 18 సీట్లను చిన్న చితకా పార్టీలకు ఇస్తామని ప్రకటించారు. బీజేపీ, శివసేన తలో 135 స్థానాల్లో పోటీచేసే యోచనలో ఉన్నాయి. కానీ సీట్ల కేటాయింపుపై మాత్రం క్లారిటీ రాలేదు.

50.. 50 ఫార్ములా

50.. 50 ఫార్ములా

గత సార్వత్రిక ఎన్నికల్లో 50.. 50 ఫార్ములా వర్కౌట్ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన శివసేన నుంచి వచ్చింది. కానీ ఇందుకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో సీట్ల కేటాయింపు ఆలస్యమై .. ఇతర పార్టీలకు మేలుచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడైనా త్వరపడుతామని శివసేన భావిస్తోంది. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. సీట్ల కేటాయింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతీరోజు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ తాము విపక్ష స్థానంలో ఉంటే చర్చలు మరింత సహృద్భావ వాతావరణంలో కొనసాగేవని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis and Shiv Sena boss Uddhav Thackeray on Wednesday shared a stage and made a joint promise at an event to underscore that the alliance was on track for the state elections scheduled for next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X