వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్‌లు - డిప్యూటీ చేతిలో ‘స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్‌పీ - మోదీ ఒక్కరే

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారంతో 60వ పడిలోకి ప్రవేశించారు. గతేడాది నవంబర్ లో అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్ర సారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సీఎం హోదాలో జరుపుకొంటున్న మొదటి బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, సొంత మనుషులు, బాగా ఆప్తులైన వాళ్లు నుంచే ఆయనకు పంచ్‌లు, విమర్శలు ఎదురుకావడం చర్చనీయాంశమైంది.

Recommended Video

Maharashtra Day: A Big Relief For CM Uddhav Thackeray | Oneindia Telugu

కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..

డిప్యూటీ ట్రోలింగ్ చేశారా?

డిప్యూటీ ట్రోలింగ్ చేశారా?


మహారాష్ట్ర సీఎం పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ శుభాకాంక్షలు చెప్పిన తీరు, అందుకోసం ఆయన వాడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికార మహా వికాస్ ఆగాధి(ఎంవీఏ) కూటమిలో పైచేయి ఎవరిదనే దానిపై చర్చకుతోడు అయోధ్య అంశంలో మూడు పార్టీలూ భిన్న వైఖరి ప్రదర్శిస్తున్న సమయంలో.. అజిత్ చర్య.. ఉద్ధవ్ ను ట్రోల్ చేసినట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్సీపీ మాత్రం అలాంటిదేమీ లేదని కవరింగ్ ఇచ్చింది.

సర్కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో?

సర్కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో?

బీజేపీతో విభేదాల తర్వాత శివసేన తనకు భిన్నధృవాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎంవీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆదివారం సామ్నా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూటమి పరిస్థితిని వివరిస్తూ ఉద్ధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రభుత్వం.. పేదల వాహనమైన మూడు చక్రాల ఆటో లాంటిది. శివసేన ముందు చక్రమైతే, వెనుక రెండు టైర్లు కాంగ్రెస్, ఎన్సీపీ. స్టీరింగ్ మాత్రం నా చేతుల్లోనే ఉంది'' అని పేర్కొన్నారు. అయితే, సోమవారం నాటి పుట్టినరోజు సందేశంలో డిప్యూటీ సీఎం పవార్ మాత్రం.. గోల్ఫ్ కార్టులో తాను స్టీరింగ్ చేతబట్టగా, పక్కనే ఉద్ధవ్ కూర్చున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘తద్వరా సర్కారు స్టీరింగ్ నా చేతుల్లోనే ఉందని చెబుతున్నారా అజిత్ దాదా?''అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఫొటో వైరల్ కావడంతో, సీఎంను ట్రోల్ చేసే ఉద్దేశం తమకు లేదని, అజిత్ యధాలాపంగానే విషెస్ చెప్పారని ఎన్సీపీ ప్రకటన చేసింది.

పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?

ఉద్ధవ్‌పై వీహెచ్‌పీ నిప్పులు..

ఉద్ధవ్‌పై వీహెచ్‌పీ నిప్పులు..


బాల్ ఠాక్రే నేతృత్వంలో ఒకప్పుడు కరడుగట్టిన హిందూత్వ పార్టీగా ఉన్న శివసేన ఇప్పుడు ప్రతిపక్ష ధోరణిలో గుడ్డిగా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నదంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో అయోధ్య మందిరం భూమి పూజను ఆన్ లైన్ లో నిర్వహిస్తే తప్పేంటి? అంటూ ఉద్ధవ్ ఠాక్రే చేసిన కామెంట్లపై వీహెచ్‌పీ మండిపడింది. పవిత్రమైన కార్యంపై శివసేన చీఫ్ ఇలా మాట్లాడటం ఖండనీయమని, ఠాక్రే వ్యాఖ్యలకు చింతిస్తున్నామని అలోక్ కుమార్ అన్నారు.

మహా సీఎంకు ప్రధాని విషెస్..

మహా సీఎంకు ప్రధాని విషెస్..

పుట్టినరోజు నాడే తన డిప్యూటీ నుంచి దాదాపు ట్రోలింగ్, వీహెచ్‌పీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే సముచిత రీతిలో, రాజకీయాల ప్రస్తావన లేకుండా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉద్ధవ్ జీ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను''అని మోదీ ట్విటర్ లో రాశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తరహాలో మహారాష్ట్రలోనూ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీజేపీ నేతలు ఇటీవల వ్యాఖ్యానాలు చేయడంపై సీఎం ఉద్ధవ్ ఘాటుగా స్పందించారు. ‘‘సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఎందుకు, దమ్ముంటే ఇప్పుడే మా ప్రభుత్వాన్ని పడగొట్టండి చూద్దాం''అని ఠాక్రే సవాలు విసిరారు.

English summary
on Maharashtra cm Uddhav Thackeray birth day, the Deputy CM Ajit Pawar's message went viral as it seems like Trolling, but NCP Denies It. other side, VHP slams Uddhav for wanting e-Bhoomi Pujan in Ayodhya, says it’s fall of a Hindutva party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X