వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా:మండలికి ఉద్దవ్ థాకరే, మరో 8 మంది కూడా.. సీఎం సీటు సేఫ్..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎగువసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర శాసనమండలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు నామినేషన్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఒక్కో స్థానానికి ఒక్క అభ్యర్థి పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు.

8 మంది సభ్యులు..

8 మంది సభ్యులు..


ఉద్దవ్ థాకరేతోపాటు డిప్యూటీ చైర్ పర్సన్ నీలమ్ గోర్హె (శివసేన), బీజేపీకి చెందిన రంజిత్ సిన్హ్ మోహిత్ పాటిల్, గోపిచంద్ పడల్కర్, ప్రవీణ్ దట్కే, రమేశ్ కారాడ్, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిట్కారీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్ ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే సమయం ముగియడం, ఒక్క అభ్యర్థి బరిలో ఉండగా వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.

288 సీట్లు..

288 సీట్లు..

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ద్వై వార్షిక మండలి ఎన్నికల్లో భాగంగా 9 సీట్లు ఏప్రిల్ 24వ తేదీ ఖాళీ అయ్యాయి. 9 సీట్లకు తొమ్మిది మంది పోటీ చేశారు. మహారాష్ట్రలో నవంబర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవకపోవడంతో... ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీతో శివసేన జట్టుకట్టింది. వ్యుహాత్మకంగా ఉద్దవ్ థాకరే పేరు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అంతకుముందు ఆయన శాసనసభలో గానీ, మండలిలో గానీ సభ్యుడు కారు.

Recommended Video

Sonu Sood Arranges Buses For Migrants Stuck In Mumbai
మే 27 డెడ్ లైన్..

మే 27 డెడ్ లైన్..


సీఎం పదవీ చేపట్టిన ఆరు నెలల్లోపే శాసనసభ/శాసనమండలి నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. మే 27వ తేదీ 2020లోపు సభ్యుడు కావాలి. మండలి ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ బ్రేక్ చేసింది. కానీ సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని.. ఎన్నికల సంఘం, ప్రధానికి ఉద్దవ్ థాకరే లేఖ రాశారు. దీంతో కేంద్రం స్పందించి.. మండలి ఎన్నికలు నిర్వహణకు ఓకే చెప్పింది. నామినేషన్లకు గడువు ముగిసేలోపు.. ఒక్కో అభ్యర్థి దరఖాస్తు చేయడంతో.. వారి ఎన్నికయ్యారని ఈసీ పేర్కొన్నది.

English summary
maharahstra chief minister Uddhav Thackeray elected unopposed to Council ec officials said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X