వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రధాని మోడీని కలిసిన ఉద్ధవ్ థాక్రే

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు లోహెగావ్ విమానాశ్రయంకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతోపాటు ఉద్ధవ్ థాక్రే స్వాగతం పలికారు.

విమానాశ్రయ ఆవరణలో ఇరువురు కాసేపు పలు అంశాలపై చర్చించారు. ఎయిర్‌పోర్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పుణెలో జరగనున్న వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో మోడీ పాల్గొననున్నారు.

 Uddhav Thackeray meets PM Narendra Modi for the first time after becoming CM

కాగా, మహారాష్ట్రలో అనేక మలుపులు తిరిగిన తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతుల చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో శిసేనకు మద్దతు తెలపడంతోపాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ మూడు పార్టీలో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అంతకుముందు ఎన్సీపీ కీలక అజిత్ పవార్ మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అజిత్ పవార్, ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ తమ పదవులకు రాజీనామా చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు కలిసే పోటీ చేసినప్పటికీ.. ఎన్నికల అనంతరం శివసేన తమకు కూడా ముఖ్యమంత్రి పదవి రెండున్నరేళ్లు కావాలంటూ డిమాండ్ చేసింది. దీనికి బీజేపీ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది శివసేన. పరస్పరం ఇరుపార్టీల నేతలు విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

English summary
Maharashtra Chief Minister Uddhav Thackeray received Prime Minister Narendra Modi at the Pune airport on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X