వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపాదకుడి నుంచి సీఎం వరకు, థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా, ఉద్దవ్ నేపథ్యం..

|
Google Oneindia TeluguNews

ఉద్దవ్ థాకరే.. శివసేన చీఫ్‌గానే తెలుసు. ఆ పార్టీ మౌత్‌పీస్‌గా పిలువబడే 'సామ్నా' పత్రిక ఎడిటర్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్న తనదైనశైలిలో సంపాదకీయం రాస్తూ ముద్ర వేశారు. ప్రాంతీయ పార్టీ అయిన శివసేన సీఎం పదవీ చేపట్టే సీట్లు సాధించలేదు. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ-శివసేన మధ్య సీఎం పోస్టు కోసం యుద్ధమే జరిగింది. చివరికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి జైకొట్టి.. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.

ఉద్ధవ్ పై అభినందనల వెల్లువ: అటు నరేంద్ర మోడీ, ఇటు మమతా బెనర్జీ.. !ఉద్ధవ్ పై అభినందనల వెల్లువ: అటు నరేంద్ర మోడీ, ఇటు మమతా బెనర్జీ.. !

పోటీకి దూరం..

పోటీకి దూరం..

వాస్తవానికి శివసేన పార్టీ నుంచి ఇదివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఎవరూ పోటీ చేయలేదు. బాల్ థాకరే.. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ మహారాష్ట్రీయుల సమస్యలపై మాత్రం ఆలుపెరుగని పోరాటం చేశారు. ఆయన కుమారుడు ఉద్దవ్ కూడా ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆసక్తి చూపించలేదు. 2014లో సీఎం పదవీ ఆశించారు.. కానీ బీజేపీ ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. కానీ 2019లో మాత్రం సీన్ మారింది. సీఎం పోస్టు కోసం పట్టుబట్టీ మరీ బీజేపీకి హ్యాండిచ్చారు.

పోటీకి నో.. కానీ

పోటీకి నో.. కానీ

ఉద్దవ్ థాకరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. సీఎం పదవీ చేపట్టాక.. ఆరునెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలుపొందాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు సామ్నా పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఉద్దవ్.. గురువారం రాజీనామా చేశారు. సీఎం పదవీ చేపట్టే కొన్ని గంటల ముందు రిజైన్ చేశారు. దీంతో సామ్నా మొదటి పేజీలో ఎడిటర్-ఇన్-చీఫ్ అనే పేరు ఉద్దవ్ థాకరే కనిపించదు. శివసేన పార్టీకి చెందిన సంజయ్ రౌత్ సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత

20 ఏళ్ల తర్వాత

20 ఏళ్ల తర్వాత శివసేన పార్టీకి చెందిన నేత సీఎం పదవీ చేపట్టారు. ఉద్దవ్ థాకరేకు ముందు నారాయణ్ రాణే సీఎం పదవీ చేపట్టారు. 1999లో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలుత 1995లో మనోహర్ జోషి శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. జోషి, రాణే తర్వాత మూడో శివసేన సీఎంగా ఉద్దవ్ ప్రమాణం చేశారు.

2014లో ఇంట్రెస్ట్

2014లో ఇంట్రెస్ట్

బాల్‌థాకరే తనయుడిగా ఉద్దవ్. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. 2014లో సీఎం పోస్టపై ఇంట్రెస్ట్ చూపించారు. కానీ కుదరకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈసారి కలిసి రావడంతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టారు. సీఎం పదవీ చేపట్టేందుకు తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఉద్దవ్ థాకరే ధన్యవాదాలు తెలిపారు.

తెరపైకి ఆదిత్య.. కానీ

తెరపైకి ఆదిత్య.. కానీ

ఈ సారి థాకరే కుటుంబం సీఎం పదవీ చేపట్టబోతుందనే ప్రచారం జరిగింది. ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే వర్లి నుంచి పోటీచేయడంతో ఆయన పదవీ చేపడుతారా అనే చర్చ జరిగింది. 29 ఏళ్లకే సీఎం పదవీ అని డిస్కషన్ జోరుగా సాగింది. అయితే బీజేపీతో పొత్తు పొడవకపోవడం.. కాంగ్రెస్-ఎన్సీపీతో దోస్తి కుదరడంతో.. ఆదిత్య థాకరేకు సీఎం పదవీ అనే అంశం మసకబారిపోయింది.

English summary
shiv Sena chief Uddhav Thackeray has resigned as the editor of Saamana, Shiv Sena's mouthpiece.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X