వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల(ఫొటో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ప్రాణాలతో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం విడుదల చేసింది.

ఇటీవల కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా, అందులో ఓ ఉగ్రవాది నవేద్‌ భారత సైన్యానికి ప్రాణాలతో పట్టుబడ్డ విషయం తెలిసిందే.

పాక్‌కు చెందిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించారు. వీరిలో నవేద్‌, మహ్మద్‌ నోమన్‌ అనే ఇద్దరు ఉధంపూర్‌లో దాడులు జరిపారు. భారత భద్రతా దళాల కాల్పుల్లో నోమన్‌ మృతి చెందగా, నవేద్‌ ప్రాణాలతో పట్టుబడ్డాడు.

Udhampur attack: NIA releases sketch of Naved's accomplices

మరో ఇద్దరు జార్గమ్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌, అబు ఓకాష అనే ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. జార్గమ్ వయస్సు 38 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, అబు ఓకాష వయస్సు 17 నుంచి 18ఏళ్ల మధ్య ఉంటుందని ఎన్ఐఏ పేర్కొంది.

కాగా, అయితే నవేద్‌ను సోమవారం ఢిల్లీ కోర్టులో విచారించారు. నవేద్‌ తెలిపిన వివరాల ప్రకారం పరారీలో ఉన్న ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం విడుదల చేశారు. వారిని పట్టించిన వారికి రూ. 10లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

English summary
Zargam and Abu Okasha are the two accomplices of Mohammad Naved that the National Investigating Agency has launched a manhunt for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X