వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనూ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది: నటుడు ఉదయనిధి

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలపై కన్నేశారు. ఆయన ఇప్పటికే డీఎంకేలో సభ్యులు. రజనీకాంత్, కమల్ హాసన్‌ల తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. రజనీకాంత్, కమల్‌ల తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇతను ప్రస్తుతం నిమిర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రయలర్ ఇటీవల విడుదలైంది.

Udhayanidhi Stalin to enter politics?

ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా పలువురు విలేకర్లు ఆయనను రాజకీయాలపై ప్రశ్నించారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని అడిగారు. దీనికి ఉదయనిధి స్పందిస్తూ.. తాను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని, తాను కొత్తగా లేనని, డీఎంకే నా రక్తంలో ఉందని చెప్పారు. సినిమాల్లోకి రాకముందు రాజకీయాల్లో తనకు అనుభవం ఉందని చెప్పారు.

కానీ సినిమాల్లోకి వచ్చాక ఇక రాజకీయాల గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన తండ్రి స్టాలిన్ కోసం చెన్నైలోని 1000 లైట్స్ ప్రాంతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు కొందరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇక నేను కూడా రావడానికి మంచి తరుణం ఇదే అనిపిస్తోందన్నారు.

English summary
Stalin’s son and actor-producer Udhayanidhi Stalin has reportedly hinted about starting his political journey. Speaking at a wedding event today, Udhayanidhi reportedly said, “On seeing a lot of actors jumping into politics in the recent times, I think it’s time for me to go to active politics.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X