వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఉడిపి స్వామీజీ అనుమానాస్పద మృతి, ఒక్కరికే పుడ్ పాయిజన్, బాంబు పేల్చిన లాయర్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాంబు పేల్చిన స్వామీజీ లాయర్

బెంగళూరు: దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఉడిపిలోని అష్టమఠాలలో ఒక్కటి అయిన శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ (55) గురువారం అనుమానాస్పదస్థితిలో మరణించారు. మణిపాల్ లోని కేఎంసీ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ మరణించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో స్వామీజీ లాయర్ బాంబు పేల్చారు.

ఫుడ్ పాయిజన్

ఫుడ్ పాయిజన్

ఉడిపిలోని శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ బుధవారం రాత్రి ఫుడ్ పాయిజ్ తో అనారోగ్యానికి గురైనారు. వెంటనే స్వామీజీని మణిపాల్ లోని కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ మీద స్వామీజీకి చికిత్స చేశారు. చికిత్స విఫలమై గురువారం శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ మరణించారని వైద్యులు తెలిపారు.

ఒక్క స్వామీజీకే ఫుడ్ పాయిజన్ ?

ఒక్క స్వామీజీకే ఫుడ్ పాయిజన్ ?

మఠంలో ఆహారం సేవించిన అందరికీ ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురు కాకుండా ఒక్క స్వామీజీకి మాత్రమే ఎందుకు ఫుడ్ పాయిజన్ అయ్యింది ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వామీజీ విషాహారం సేవించడం నిజం అని వైద్యులు అంటున్నారు.

చంపాలని విషం కలిపారు ?

చంపాలని విషం కలిపారు ?

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ ఆలయంలోని దేవుడి విగ్రహాన్ని వేరే మఠంకు అప్పగించారు. తాను ఇచ్చిన విగ్రహం తిరిగి ఇవ్వాలని కొన్ని రోజులుగా స్వామీజీ డిమాండ్ చేస్తున్నారు. దేవుడి విగ్రహం తిరిగి ఇవ్వడానికి ఆ మఠాధిపతులు నిరాకరించారు. ఈ సందర్బంగా కావాలనే శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ సేవించే ఆహారంలో విషం కలిపి ఉంటారని ఆయన సన్నిహిత స్వామీజీలు, భక్తులు ఆరోపిస్తున్నారు.

బాంబు పేల్చిన లాయర్

బాంబు పేల్చిన లాయర్

జూన్ 28వ తేదీ శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ తనను కలిసి దేవుడి విగ్రహం తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన పుత్తి మఠం మినహా అష్టమఠాలలోని ఆరు మఠాల మీద కేవియట్ ఫిటీషన్ దాఖలు చెయ్యాలని, క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని చెప్పారని, తనకు ప్రాణహాని ఉందని అన్నారని ఆయన న్యాయవాది రవికిరణ్ మురడేశ్వర గురువారం బాంబు పేల్చారు. స్వామీజీ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని న్యాయవాది రవికిరణ్ మురడేశ్వర డిమాండ్ చేశారు.

మాజీ ప్రధాని, మాజీ సీఎం

మాజీ ప్రధాని, మాజీ సీఎం

ఉడిపి శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మీవర తీర్థస్వామీజీ నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాటం చేశారని, అలాంటి స్వామీజీ అతి చిన్న వయసులో మరణించడం భక్తులకు తీరని లోటు అని మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే విచారం వ్యక్తం చేశారు.

English summary
Shiruru lakshmivara swamiji is no more. Yesterday night he had some food poison and admitted to Manipal hospital. Is Shiroor Seer Lakshmivara Thirtha was poisoned? KMC, Manipal doctor Avinash Shetty suspect food poison is the main cause of death. Postmortem is going on under the observation of Manipal police. Shiroor Seer passed away today morning. Shiroor's lawyer Ravikiran said to media that Shiroor Seer recently said that his 'life is in danger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X