వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్లీ ఫెలో..! వీసా కోసం పెళ్లిళ్ల దందా..! అమెరికాలో చిటుక్కున 80పెళ్లిళ్లు చేసిన ఎద‌వ‌..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌/హైద‌రాబాద్ : అమెరికా వెళ్లి స్థిరపడిపోదామన్నది అనేకమంది చికాల స్వ‌ప్నం. దీన్ని నెరవేర్చుకోవడం కోసం పౌరసత్వం ఉన్న అమెరికన్‌ని పెళ్లి చేసుకుంటే వీసా అతి సులువుగా వచ్చేస్తుందని, ఒకసారి ఇది చేతిలో పడితే ఇక తిరుగుండదని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. దీన్ని తెలివిగా సొమ్ము చేసుకుందామనుకున్నాడో తెలుగు ప్రబుద్ధుడు. 47 సంవ‌త్స‌రాల కొల్లా ర‌వి బాబు అనే వ్య‌క్తి అమెరికాకు వచ్చిన భారతీయులకు అభూత క‌ల్ప‌న‌లు క‌ల్పించి అమెరికా పౌరసత్వం ఉన్న వారితో వారికి అక్కడ పెళ్లి జరిపించే అక్రమ దందా కు శ్రీ‌కారం చుట్టాడు. అందుకోసం ఓ కన్స‌ల్టెన్సీని ప్రారంభించి చిటుక్కున దాదాపు 80 పెల్లిళ్లు చేపాడు స‌ద‌రు మేధావి.

 అమెరికాలో వీసా మోసం ముఠా..! భార‌తీయుల‌నే టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు..!!

అమెరికాలో వీసా మోసం ముఠా..! భార‌తీయుల‌నే టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు..!!

ఫ్లోరిడా రాష్ట్రంలోని పనామా సిటీలో సాగిన ఈ దందాలో కొల్లా ర‌వి బాబు ఓ అమెరికన్‌ జాతీయురాలు- క్రిస్టల్‌ క్లౌడ్‌(40)తో చేతులు కలిపాడు. 2017 ఫిబ్రవరి నుంచి 2018 ఆగస్టు దాకా వారిద్దరూ బౌ కౌంటీలో ఇమిగ్రేషన్‌ పెళ్లిళ్ల దందా నిర్వహించారు. తమ సంస్థలోకి అమెరికా పౌరసత్వం ఉన్నవారిని చేర్చుకుని, భారత్‌ నుంచి వచ్చే వారితో వారికి పెళ్లిళ్లు జరిపించేవారు. అలా అతిస్పల్ప కాలంలో ఏకంగా 80 మందికి పెళ్లిళ్లు చేశారంటే వారి నెట్‌వర్క్ ఎంత గా ప్రాచూర్యం పొందిందో అర్థమవుతుంది.

పెళ్లి చెసి వీసా ద‌క్కించుకోవాలి.! సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే దందా..!!

పెళ్లి చెసి వీసా ద‌క్కించుకోవాలి.! సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే దందా..!!

కాని ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయ‌లేమ‌నే సామెత ప్ర‌కారం మ‌న ర‌విబాబు ఆట‌లు ఎక్కువ‌రోజులు సాగ‌లేదు. అమెరికా పౌరసత్వ-వలస సేవల విభాగం, ఆంతరంగిక భద్రతా విభాగం, ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మొదలైన సంస్థలను ఎక్కువ కాలం ఏమార్చ‌డం సాధ్యపడదని వీరికి తెలియదు. ముఖ్యంగా అమెరికాలో అడుగుపెట్టే భారతీయులపై నిఘా చాలా ఎక్కువయిన రోజులివి. గ్రీన్‌కార్డు కోసమో, హెచ్‌1బీ కోసమో ఏళ్ల తరబడి వేచిచూస్తున్న భారతీయులకు (తెలుగువారికి) -పౌరసత్వం ఉన్న అమెరికన్లతో వివాహం జరగడం ఈ సంస్థల్లో అనుమానాలు రేకెత్తించింది.

మనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షంమనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షం

80 పెళ్లిళ్లు జరిపిన తెలుగువాడిపై విచారణ..! మేలో అమెరికా కోర్టు శిక్ష..!!

80 పెళ్లిళ్లు జరిపిన తెలుగువాడిపై విచారణ..! మేలో అమెరికా కోర్టు శిక్ష..!!

అందులో కొన్ని పెళ్లిళ్లు అమెరికన్లకు రెండోవో, మూడోవో కావడం విశేషం. వెంటనే ఇమిగ్రేషన్‌, పోలీస్‌ అధికారులు రంగంలోకి దిగి కూపీ లాగారు. అమెరికన్లను తమ సంస్థలో చేర్చుకోవడంలో క్లౌడ్‌ చురుగ్గా పనిచేసింది. ఆమె వీసా మోసానికి పాల్పడ్డట్లు గుర్తించి 2018 డిసెంబర్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. క్లౌడ్‌కు ఇప్పటికే రెండేళ్ల శిక్ష విధించింది. వీసా మోసానికి పాల్పడినట్లుగా రవిబాబు కూడా కోర్టులో అంగీకరించాడు.

 ఈజీ మ‌నీ కోసం దొంగ వేశాలు..! నాశ‌నమైపోతున్న జీవితాలు..!!

ఈజీ మ‌నీ కోసం దొంగ వేశాలు..! నాశ‌నమైపోతున్న జీవితాలు..!!

ఆయన వీసా మోసమే కాక- మనీలాండరింగ్‌కు కూడా పాల్పడ్డట్లు తేల్చారు. తలహసేలోని కోర్టు మే 22న వాదనలు విని అతనికి శిక్ష ఖరారు చేస్తుంది. అక్రమంగా పెళ్లిళ్లు, వీసా మోసం కింద రవిబాబుకు ఐదేళ్లు, మనీలాండరింగ్‌కు కుట్ర పన్నినందుకు 20 ఏళ్లు గరిష్ఠంగా శిక్ష పడే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేశం కాని దేశం వెళ్లి క‌ష్ట‌ప‌డి ప‌నిచేసుకోవ‌డం వ‌దిలేసి సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌ని అడ్డ‌దార్లు తొక్కితే ఇలాగే జీవితాలు నాశ‌న‌మై పోతాయి మ‌రి.

English summary
There's a lot of charms in America that can go to America. If you are married to a citizen of America to get this Visa done, visa is very easy, and once you get the visa no problem for life long
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X