వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖం ఆధారంగా ఆధార్ వేరిఫికేషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూఐడిఏఐ ముఖం ఆధారంగా ఆధార్ గుర్తింపును సరిచూసుకొనే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం నుండి ఈ మేరకు యూఐడిఏఐ ప్రకటించింది.

ఇప్పటివరకు బయోమెట్రిక్ ద్వారా ఐరిష్, వేలిముద్రల ఆధారంగా ఆధార్‌ను సరిపోల్చుకొనే ప్రక్రియ కొనసాగుతోంది.అయితే ముఖం ఆధారంగా ఆధార్‌ గుర్తింపును సరిపోల్చుకొనే ప్రక్రియ జూలై 1వ, తేది నుండి గుర్తింపు పొందిన పరికరాల్లో అందుబాటులోకి రానుందని యూఐడిఐఏ ప్రకటించింది.

UIDAI allows facial recognition for Aadhaar authentication

ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను తీసుకొంటున్న లబ్దిదారులు తాము ఈ ప్రయోజనాలను పొందలేదని చెప్పేందుకు నిరాకరించడానికి వీలు లేకుండా పోతోంది.

బయోమెట్రిక్ ప్రక్రియలో వేలిముద్రలు సరిపోలేని వారికి ఈ పద్దతి ఉపయోగకరంగా ఉంటుంది. కుష్టువ్యాధిగ్రస్తులతో పాటు, బాగా కష్టపడే వారి వేలిముద్రలు కొన్ని సమయాల్లో బయోమెట్రిక్ విధానంలో సరిపోలడం లేదు.దీంతో ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యూఐడిఏఐ ప్రకటించింది.

అయితే ఇప్పటికే ఆధార్ కార్డు పొందిన వారికి చెందిన ముఖం చిత్రాల డేటా బేస్ యూఐడిఏఐలో నిక్షిప్తమై ఉంది. ఈ కొత్త పద్దతి అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అనుమతించే అవకాశం ఉంది.గత బుదవారం రోజు వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చని యూఐడిఏఐ ప్రకటించింది.

English summary
The Unique Identification Authority of India (UIDAI) on Monday moved to enable facial recognition as an additional means of Aadhaar authentication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X