వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదోసారి: నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెదురు

|
Google Oneindia TeluguNews

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కేసులో కీలక నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి మరోసారి యూకే కోర్టులో చుక్కెదురైంది. పీఎన్బీ స్కాం కేసులో లండన్‌లో నీరవ్ మోడీ అరెస్టయిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే కోర్టు మరోసారి తిరస్కరించింది.

పీఎన్బీ కేసు సంబంధించి ఈ ఏడాది మార్చి 19న లండన్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నీరవ్ మోడీ బెయిల్ దరఖాస్తును యూకే కోర్టు ఇప్పటికే నాలుగు సార్లు తిరస్కరించింది.

నీరవ్ మోడీకి ఈడీ షాక్: వేలానికి రూ. 2 కోట్ల బెంట్లీ సహా 13 లగ్జరీ కార్లునీరవ్ మోడీకి ఈడీ షాక్: వేలానికి రూ. 2 కోట్ల బెంట్లీ సహా 13 లగ్జరీ కార్లు

అయినా, మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఈ స్కాం నిందితుడు. తాను తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతున్నానని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను గృహ నిర్బంధంలో ఉంచాలని అభ్యర్థించాడు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ ఇవ్వలేమిన స్పష్టం చేసింది. మీడియాకు లీకులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 UK court rejects Nirav Modis fresh bail application; warns against leaks to media

ఇది ఇలావుండగా, నీరవ్ మోడీకి చెందిన విలాసవంతమైన కార్లను వేలం వేసేందుకు ఈడీ నిర్ణయించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు రూ. 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. నీరవ్ మోడీకి చెందిన 13 విలాసవంతమైన కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలం వేసేందుకు సిద్ధమైంది.

నీరవ్ మోడీ కార్లలో రూ. 2 కోట్లకుపైగా విలువైన బెంట్లీ కారు కూడా ఉండటం గమనార్హం. నవంబర్ 7న ఈ వేలం నిర్వహించనున్నట్లు ఈడీ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీని లండన్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోడీ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ ఆశ్రయించింది.

నీరవ్ మోడీకి చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. అతడికి చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేసే విధంగా అనుమతి పొందింది. ఇందులో భాగంగా నవంబర్ 7న వేలం నిర్వహించనుంది.

English summary
In a setback to Nirav Modi, a UK court yet again rejected a fresh bail plea of the fugitive diamond merchant on Wednesday despite an offer of an "unprecedented bail package", which included 4-million pounds in security as well as house arrest akin to those imposed on terrorist suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X