వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి జీ7 సమ్మిట్‌కు హాజరుకావాలంటూ యూకే ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

లండన్/న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానించింది. ఆ సదస్సుకు ముందు బ్రిటన్ దేశ ప్రధాని బోరీస్ జాన్సన్ మనదేశంలో పర్యటించే అవకాశం ఉంది.

జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాలకు బోరీస్ జాన్సన్ ముఖ్య అతిథిగా ఇండియాను సందర్శించాల్సి ఉంది. అయితే, తమ దేశంలో అయితే, తమ దేశంలో ప్రభలుతున్న మ్యూటెంట్ కరోనావైరస్ దృష్ట్యా ఆయన తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ జీ-7లో సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ తోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను అతిథులుగా శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినట్లు యూకే హైకమిషన్ తెలిపింది.

UK Invites PM Modi To Attend G7 Summit 2021, Event To Be Held In June

ప్రపంచ దేశాల్లో కరోనావైరస్ పరిస్థితి, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఈ సభ్యదేశాలు చర సభ్యదేశాలు చర్చించనున్నాయి. ఈ ప్రకటనలో మేరకు ప్రకటనలో పేర్కొంది. కరోనా మహ్మారిపై పోరులో భారత, బ్రిటన్ దేశాలు సహకరించుకుంటున్నాయని, ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నాయని తెలిపింది.

జీ7 సదస్సుకు ముందే బోరీస్ జాన్సన్ ఇండియాను సందర్శించగోరుతున్నారని ఈ ప్రకటనలో బ్రిటన్ వెల్లడించింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

మరోవైపు బ్రిటన్ లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. అయితే, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను ప్రజలు, ముఖ్యంగా యువత లెక్క చేయకపోవడంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. లండన్ తదితర నగరాల్లో విధించిన లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బ్రిటన్ నుంచి వస్తున్న వారి కారణంగా మనదేశంలోనూ యూకే మ్యుటెంట్ వైరస్ వ్యాప్తి జరుగుతోంది. మనదేశంలో ఈ వైరస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 100కు మించాయి.

English summary
UK Invites PM Modi To Attend G7 Summit 2021, Event To Be Held In June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X