వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే

|
Google Oneindia TeluguNews

ఇండియాలో ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది . భారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు కూడా ఇండియాలోమరో రెండు నమోదయ్యాయి. ఇక వీరికి సన్నిహితంగా ఉన్న వారిని సైతం క్వారంటైన్ కు పంపించారు. ఇప్పటివరకు భారత దేశంలో యూకే కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 116 కి పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం

బ్రిటన్ లో మొదలైన కరోనా కొత్త రకం వైరస్ ఇప్పటి వరకు 50 దేశాలలో విస్తరించింది. ఇక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది . వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అన్ని దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారి కరోనా మహమ్మారి కి శాశ్వతంగా చెక్ పెట్టడం కోసం ఒకపక్క ప్రయత్నం జరుగుతున్న సమయంలో మరోపక్క యూకే కరోనా కొత్త రకం వైరస్ కేసులు పెరగటం ఇబ్బంది పెడుతుంది.

 UK new corona virus strain spread to 50 countries .. 116 people infected in India so far

మొదట విమాన సర్వీసులు నిలిపివేసిన కేంద్ర సర్కార్ తిరిగి జనవరి 8వ తేదీ నుండి విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో యూకే నుండి ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే వీరందరికీ ఎయిర్ పోర్టుల లోనే కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లకు పంపిస్తున్నారు. ముఖ్యంగా వారి వివరాలు సేకరించటంతో పాటు వారి కుటుంబ సభ్యుల కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేపడుతున్నట్టు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ . పాజిటివ్ వచ్చిన వారి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేపడుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

English summary
As many as 116 people have tested positive for the new UK variant of SARS-CoV-2 in India until saturday, said the Union Health Ministry.The ministry further informed that the situation is being monitored carefully and regular advice provided to states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X