వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భరతమాతకు బ్రిటిష్ ప్రధాని వందనం -రిపబ్లిక్ డే-2021కు చీఫ్ గెస్ట్‌గా బోరిస్ జాన్సన్ -మోదీకి రిటర్న్ గిఫ్ట్

|
Google Oneindia TeluguNews

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత గణతంత్ర వేడుకలకు బ్రిటిష్ ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా హాజరు కావడం ఖరారైంది. 2021, జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొనాల్సిందిగా భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని యూకే ప్రధాని సగౌరవంగా స్వీకరించారు. భారత పర్యటనను ఖరారు చేస్తూ బోరిస్ స్వయంగా ప్రకటన ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తోన్న బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి సైతం మంగళవారం అధికారిక ప్రకటన చేశారు.

జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనంజగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం

 మోదీకి రిటర్న్ గిఫ్ట్

మోదీకి రిటర్న్ గిఫ్ట్

ఈ ఏడాది నవంబర్ లో చోటుచేసుకున్న ఫోన్ సంభాషణలో.. భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ ను కోరారు. దీనికి సంబంధించి ఈ నెల 2న భారత్ అధికారిక ఆహ్వానం పంపింది. 13 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ, భారత్ ఆహ్వానాన్ని సగౌరవంగా స్వీకరిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని, ఆయన మంత్రి వెల్లడించారు. అదే సమయంలో.. వచ్చే ఏడాది యూకే ఆతిత్యమివ్వనున్న జీ-7 దేశాల సదస్సులో పాల్గొనాల్సిందిగా మన ప్రధాని మోదీని బ్రిటన్ పీఎం ఆహ్వానించారు. జీ-7లో భారత్ సభ్యదేశం కానప్పటికీ మనతో వ్యాపార, వాణిజ్య, రక్షణ సంబంధాల రీత్యా ఏటా ఏదో ఒక దేశం మనల్ని సదస్సుకు ఆహ్వానిస్తున్నాయి. ఈసారి వంతు బ్రిటన్‌ది.

గొప్ప గౌరవం.. కీలక మలుపు..

గొప్ప గౌరవం.. కీలక మలుపు..

‘‘భారత రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటిష్ ప్రధానినైన నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గ్లోబల్ బ్రిటన్ కోసం వచ్చే ఏడాదికి ఉత్తేజకర ప్రారంభంగా భారత్ ను సందర్శించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో దీన్నొక కీలక మలుపుగా మేం భావిస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆశిస్తున్నా'' అంటూ యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రియాక్డ్ అయ్యారు.

భారత్-బ్రిటన్ కీలక చర్చలు

భారత్-బ్రిటన్ కీలక చర్చలు

బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మంగళవారం ఢిల్లీలో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు రంగాల్లో రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని జాయింట్ ప్రెస్ మీట్ తెలిపారు. ఇదే సందర్భంలో బ్రిటన్ ప్రధాని భారత పర్యటనను డోమినిక్ కన్ఫార్మ్ చేశారు. భారత్ ఆహ్వానాన్ని గౌరవంగా భావిస్తున్నామని, అంతే ఆదరంతో.. వచ్చే ఏడాది బ్రిటన్ నిర్వహించబోయే జీ-7 దేశాల సదస్సుకు భారత ప్రధానిని ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

 27ఏళ్ల తర్వాత బ్రిటిష్ అతిథి

27ఏళ్ల తర్వాత బ్రిటిష్ అతిథి

ఇండియా రిపబ్లిక్ డే సంబురాల్లో బ్రిటన్ ప్రధాని చీఫ్ గెస్టుగా పాల్గొననుంటడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా, 1993లో నాటి యూకే ప్రధాని జాన్ మేయర్ మన రిపబ్లిక్ డేకు అతిథిగా వచ్చారు. ఇటీవల కాలంలో భారత్, యూకే సంబంధాలు కొత్త ఎత్తులకు చేరిన నేపథ్యంలో ఈసారి వేడుకలకు బోరిస్ హాజరవుతున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారత్.. దశాబ్దాల పోరాటం అనంతరం 1947లో స్వాతంత్ర్యం పొంది, 1950 జనవరి 26 నుంచి సొంత రాజ్యాంగంతో గణతంత్ర్య రాజ్యంగా అవతరించింది. 2022నాటికి భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తికానున్నాయి.

Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభYear Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభ

English summary
Britain’s Prime Minister Boris Johnson will be the chief guest at India’s annual Republic Day Parade in January 2021, the United Kingdom has confirmed. During talks with External Affairs Minister S Jaishankar in New Delhi, visiting UK Foreign Secretary Dominic Raab confirmed that PM Johnson has accepted India’s invite to be the chief guest at the Republic Day Parade next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X