వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ గ్లోబల్ లీడర్‌: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

గడిచిన 15 నెలలుగా ప్రంపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్ పాత్రను పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. కొవిడ్ పై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.

ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి భారత్‌ రెండు లక్షల కరోనా టీకాల డోసులు ఉచితంగా అందించనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు గుటెరస్‌ కృతజ్ఞతలు తెలుపుతూ జయశంకర్‌కు ఫిబ్రవరి 17న లేఖ రాశారు. ఈ విషయాన్ని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

చైనాపై భారత్ పట్టు -16గంటల పాటు పదో రౌండ్ చర్చలు -హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌‌లోనూ బలగాల ఉపసంహరణ!చైనాపై భారత్ పట్టు -16గంటల పాటు పదో రౌండ్ చర్చలు -హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌‌లోనూ బలగాల ఉపసంహరణ!

కరోనా అంతానికి భారత్‌ చేపడుతున్న చర్యలను గుటెరస్‌ లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు. కొవిడ్ విలయం తొలినాళ్ల నుంచే ప్రపంచ దేశాలకు భారత్‌ అందిస్తున్న సేవల్ని గుర్తుచేశారు. గడిచిన 10 నెలల కాలంలో భారత్.. ఏకంగా 150కిపైగా దేశాలకు కీలక ఔషధాలు, మెడికల్‌ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తూ కరోనాపై పోరులో 'గ్లోబల్‌ లీడర్‌'గా వ్యవహరిస్తోందని యూఎన్ చీఫ్ వ్యాఖ్యానించారు.

UN chief Antonio Guterres lauds Indias leadership fight against Covid-19, vaccine assistance

యావత్తు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ భారత్‌ తయారీ సామర్థ్యం వల్లే సాధ్యమైందని గుటెరస్ అన్నారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగమమైంది. అలాగే ప్రపంచదేశాలకు సమానంగా కరోనా టీకా అందించాలన్న ఉద్దేశంతో ఐరాస నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ బలోపేతానికీ భారత్‌ సహకరిస్తోందని వెల్లడించారు. కాగా,

అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీఅసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీ

గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11.16కోట్లకు పెరిగాయి. మరణాల సంఖ్య 25 లక్షలకు చేరువైంది. యూరప్, అమెరికాలతోపాటు భారత్ లోని పలు రాష్ట్రాల్లోనూ తాజాగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

English summary
UN chief Antonio Guterres has voiced appreciation for India’s leadership in the global fight against the coronavirus pandemic and its efforts to bring a “much-needed supply” of the COVID-19 vaccines to the world market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X