• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలి: ఇంకా పాత పద్ధతులేనా?: ఇలాగే కొనసాగితే గల్లంతే: మోడీ

|

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యున్నత విభాగం ఐక్యరాజ్యసమితి వ్యవహారశైలిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇప్పటికీ.. పాత పద్ధతులు, మూస ధోరణిలోనే కార్యకలాపాలను కొనసాగించడం వల్ల ప్రపంచదేశాలకు ఏ మాత్రం ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఇలాగే కొనసాగితే.. ఐక్యరాజ్యసమితి క్రమంగా ప్రపంచ దేశాల విశ్వాసాన్ని కోల్పోతుందని కుండబద్దలు కొట్టారు. కాలం చెల్లిన పద్ధతులు, విధానాలతో సవాళ్లను ఎదుర్కొనలేమని తేల్చి చెప్పారు.

ఐరాస 75వ వార్షికోత్సవ సభలో

ఐరాస 75వ వార్షికోత్సవ సభలో

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ ప్రీ-రికార్డెడ్ వీడియోను ప్రదర్శించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆయన ప్రసంగం సాగింది. ప్రధాని ప్రసంగం.. ఐక్యరాజ్యసమితి అనుసరిస్తోన్న విధానాలను ప్రశ్నిస్తూ కొనసాగింది. మానవత్వం, అన్ని దేశాలకు ప్రయోజనకారిగా ఉండేలా తనను తాను తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, భద్రతా మండలినీ సంస్కరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి చెప్పకనే చెప్పారు.

 ఇలాగైతే సవాళ్లను ఎదుర్కొనలేం..

ఇలాగైతే సవాళ్లను ఎదుర్కొనలేం..

ఐక్యరాజ్య సమితి ఇప్పుడు అనుసరిస్తోన్న వ్యూహాలు, విధానాలతో సరికొత్తగా పుట్టుకొస్తోన్న సవాళ్లను ఎదుర్కొనలేమని మోడీ స్పష్టం చేశారు. సంపూర్ణ, సమగ్ర సంస్కరణలను తక్షణమే చేపట్టకపోతే.. ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిపై విశ్వాసాన్ని కోల్పోతాయని అన్నారు. ప్రతి సభ్య దేశానికీ మాట్లాడే హక్కును కల్పించాలని, వారి గళాన్ని వినాలని సూచించారు. సమకాలీన సమస్యలను అర్థం చేసుకోవాలని, మానవ సంక్షేమానికి అనుగుణంగా.. వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాల్సి ఉందని మోడీ అన్నారు.

 75 సంవత్సరాల కిందట ఆశాకిరణంలా..

75 సంవత్సరాల కిందట ఆశాకిరణంలా..

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతోన్న పరిస్థితుల్లో 75 సంవత్సరాల కిందట ఓ ఆశాకిరణంలా ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందని, ప్రపంచ దేశాలన్నింటి కోసం ఓ సంస్థ ఏర్పాటు కావడం చారిత్రక ఘట్టమని మోడీ చెప్పుకొచ్చారు. భారత్‌కు మాత్రమే సాధ్యమైన వసుధైవ కుటుంబకం అనే సూత్రంతో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను జోడించిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి వల్లే ప్రపంచదేశాలు సురక్షితంగా ఉంటున్నాయనీ ప్రశంసించారు. అలాంటి సంస్థ పాత పద్ధతులను అనుసరించడం క్షేమకరం కాదని మోడీ చెప్పారు. క్షేత్రస్థాయిలో.. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా బహుళార్థ సాధకంగా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సి ఉందని సూటిగా చెప్పేశారు.

  Kim Jong Un సోదరి Kim Yo Jong Missing, సోదరి కిమ్ యో జాంగ్‌ను కిమ్ హతమార్చాడా..? || Oneindia Telugu
  శాంతిపరిరక్షక బలగాల్లో భారత్ వాటా అధికం..

  శాంతిపరిరక్షక బలగాల్లో భారత్ వాటా అధికం..


  ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బలగాల్లో భారత్ వాటా అధికంగా ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటిదాకా 160 మంది భారత మిలటరీ, పోలీస్, సివిల్ పోలీసులు శాంతి పరిరక్షణలో వీరమరణం పొందారని చెప్పారు. దశలవారీగా రెండు లక్షల ట్రూప్‌లను భారత్.. ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి పంపించిందని అన్నారు. ప్రపంచ శాంతిని కాపాడటానికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు.

  English summary
  Prime Minister Narendra Modi's call for reformed multilateralism assumes special significance as it comes on the eve of India taking a seat at the powerful UN Security Council as an elected non-permanent member for a two-year term.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X