వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలా చేయండి..!: అనంత్ అంబానీలా బరువు తగ్గాలంటే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్థూలకాయం... మనదేశంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే ఈ సమస్య నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ చాలా సులువుగా బయటపడ్డాడు. గతంలో అధిక బరువుతో కొండలా కనిపించే ఆయన ఇప్పుడు ఎంతో సన్నబడి స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.

ఇదంతా కూడా కేవలం 18 నెలల్లో జరగడం విశేషం. తద్వారా మనదేశంలో స్థూలకాయంతో బాధపడుతున్న వేలాది మంది యువతకు అనంత్ ఇప్పుడు ఆదర్శనీయుడయ్యాడు. అంతేకాదు కేవలం 18 నెలల కాలంలో 108 కిలోల బరువును తగ్గాడు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందబ్బ అని గుసగుసలాడుకుంటున్నారు.

ఆత్మన్యూనతతో బాధపడుతూ అతనిలా బరువు తగ్గాలని భావిస్తున్న వారెందరో ఉన్నారు. వారికోసం కొన్ని టిప్స్

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి:
బరువు తగ్గాలనుకునే వారు ముందుగా అసలు ఉండాల్సిన బరువెంత? మీరెంత బరువు ఉన్నారు? ఎంత తగ్గాలని అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. దీంతో పాటు వయసు కూడా ముఖ్యమే. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) సంతృప్తికర స్థాయికి రావాలంటే ఎంత బరువు తగ్గాలన్న విషయంలో ఓ గోల్ నిర్దేశించుకోవాలి

Unbelievable! This is how Anant Ambani lost 108kg in just 18 months

ఎలా చేస్తే బరువు తగ్గుతారు?
తగ్గాల్సిన బరువును బట్టి ఎక్సర్ సైజులు, యోగాలను ఓ క్రమంగా చేస్తూ వెళ్లాలి. అనంత్ విషయానికి వస్తే రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశాడు. రోజుకు 21 కిలోమీటర్లు నడిచేవాడు. యోగా చేశాడు. అధిక తీవ్రత ఉన్న గుండెకు సంబంధించిన వ్యాయామం చేశాడు. బరువు తగ్గాలంటే ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది. దీని వల్ల గుండెపై సైతం అధిక ఒత్తిడి పడదన్నది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం:
మీరు చేస్తున్న పని మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అవసరం. ఈ విషయంలో తల్లి నీతా అంబానీ నుంచి అనంత్‌కు పూర్తి సహకారం అందింది. "ఓ తల్లి ఏం చేస్తుందో పిల్లలూ అదే చేయాలని అనుకుంటారు. నా కొడుకును పస్తులతో ఉంచి నేను తినలేకపోయాను. అనంత్ ఏది తింటుంటే, నేనూ అదే తిన్నాను. అతను నడుస్తుంటే, కొంత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు నేనూ నడిచాను" అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి అనంత్‌కు చిన్నతంలో ఆస్తమా ఉంది. ఆ సమయంలో వాడిన మందుల వల్ల భారీ స్థూలకాయం వచ్చిందని నీతా అంబానీ చెప్పారు.

ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఎక్కువ సార్లు తినాలి:
తినే ఆహారం తక్కువ మొత్తంగా ఉండాలి. రోజులో ఎక్కువసార్లు తినాలి. తక్కువ కార్బోహైడ్రేడ్లు, షుగర్ ఉంటూ, శరీరానికి చాలినంత కొవ్వు, ప్రొటీన్లను అందించే ఆహారం తీసుకోవాలి. ఏదైనా తినవచ్చుగానీ, మోతాదు మాత్రం మించకూడదు.

టెక్నాలజీని వాడుకోవాలి:
ఏ రోజు ఏం చేశామన్నది ట్రాక్ చేసుకునేందుకు టెక్నాలజీని వాడుకోవాలి. రోజుకు ఎన్ని అడుగులు వేశాం? ఎంత దూరం పరిగెత్తాం? ఏం తింటే, ఎంత శక్తి వచ్చింది? ఏ పనికి ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? వంటి విషయాలను స్మార్ట్ ఫోన్ యాప్స్ సహాయంతో నిత్యమూ ట్రాక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వీటి ద్వారా, సులువుగా బరువు తగ్గాలనే మీ లక్ష్యం ఎంత దూరంలో ఉందన్న విషయం తేలికగా తెలుసుకోవచ్చు. జంతు ప్రేమికుడైన అనంత్ ప్రస్తుతం యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు.

English summary
On his 21st birthday bash, Mukesh and Nita Ambani’s son Anant shocked everyone with his weight loss. The youngest son of Mukesh and Nita, showed up at the ongoing IPL match and had everyone’s major attention with his new stunning physique.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X