కోడలిపై మామ: జుట్టుపట్టుకొని, రోడ్డుపైకి తీసుకొచ్చి.. తిడుతుండగా, అత్త కర్రతో...
అత్త,మామ వేధిస్తున్నారని గృహహింస కేసు పెట్టడమే ఆమె పాపమైపోయింది. కేసు పెట్టడం ఏమో కానీ.. వారు అలాగే ప్రవర్తించారు. కోడలు అని కాదు కదా.. సాటి మనిషి అని చూడ చూడలేదు. మృగాళ్ల ప్రవర్తించారు. భర్త అంటే ఆవేశంలో ఉన్నాడు అని కాదు.. భార్య కూడా వంతుపాడింది. ఈ విదారకర ఘటన ఒడిశాలో జరిగింది.
జాజ్పూర్ జిల్లా ధానేశ్వర్కు చెందిన నవీన్ బహెర, అతని భార్య చారులత ఉంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నారు. అతనికి పెళ్లైంది. అయితే కోడలి విషయంలో అత్త, మామలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె వారిపై గృహ హింస కేసు నమోదు చేసింది. దీంతో అత్త, మామలు శివాలెత్తిపోయారు. తన కోడలిపై ప్రతీకారం తీర్చుకున్నారు. నడిరోడ్డు మీద దారుణంగా ప్రవర్తించారు.
కోడలిని మామ జట్టుపట్టి బయటకు తీసుకొచ్చాడు. రోడ్డుపై పడేశి కర్కశంగా ప్రవర్తించాడు. కోపంలో ఉన్న భర్తకు సర్దిచెప్పాల్సిన చారులత.. కర్రతో కోడలిపై తన ప్రతాపాన్ని చూపించింది. మామ కోడలిని తిడుతుండగా, అత్త కర్రతో కొట్టింది. తనను కొట్టొద్దని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. దీంతో వారిని చూసి కోడలు గజ గజ వణికిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. దీంతో కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించారు. అత్త, మామలపై కేసు నమోదు చేశారు.