• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం ముందు రెండు యుద్ధాలు..కుప్పలా 350 మృతదేహాలు: ఓపిక నశించడం వల్లే..బాధాకరం: అమిత్ షా

|

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉందో.. వాటన్నింటినీ తీసుకుంటున్నామని అన్నారు. అనేక అభివృద్ది చెందిన దేశాలతో పోల్చుకుంటే.. మనదేశంలో కరోనా వైరస్ నియంత్రణ బాగుందని ఆయన చెప్పారు. మున్ముందు కరోనాను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు.

  INDIA గెలవాల్సిన యుద్ధాలు 2 ఉన్నాయి..!! : Amit Shah || Oneindia Telugu
  అనేక విషయాలపై..

  అనేక విషయాలపై..

  ఆదివారం ఆయన ఓ జాతీయ స్థాయి న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడారు. అనేక విషయాలను ప్రస్తావించారు. కరోనా వైరస్, చైనాతో తలెత్తిన యుద్ధ వాతావరణం, రాజకీయ ప్రత్యర్థులు సంధిస్తోన్న ప్రశ్నలు, వారి నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు సమాధానాలను ఇచ్చారు అమిత్ షా. రాజకీయ ప్రత్యర్థులు సానుకూల దృష్టిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు. ప్రతి అంశాన్నీ వారు వక్రదృష్టితో చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

  రెండు యుద్ధాలు..

  రెండు యుద్ధాలు..

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు యుద్ధాలను ఎదుర్కొంటోందని అమిత్ షా అన్నారు. ఇందులో ఒకటి కరోనా..మరొకటి చైనా.. ఈ రెండిట్లోనూ తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ రెండు యుద్ధాలు విభిన్నమైనవని, ఒకటి దేశ అంతర్గతంగా.. మరొకటి దేశ సరిహద్దులకు అవతల నెలకొని ఉన్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.

  ఢిల్లీలో దారుణ పరిస్థితులు..

  ఢిల్లీలో దారుణ పరిస్థితులు..

  కరోనా వైరస్ వల్ల దేశ రాజధానిలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమిత్ షా అన్నారు. అయినప్పటికీ.. పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి అన్ని చర్యలను చేపట్టామని, దీనికోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. వచ్చేనెల 31వ తేదీ నాటికి ఢిల్లీలో అయిదున్నర లక్షల మంది కరోనా వైరస్ బారిన పడతారంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించట్లేదని అమిత్ షా చెప్పారు. అలాంటి దారుణ స్థితి రాదనే అనుకుంటున్నానని అన్నారు.

  350 మంది మృతదేహాలకు

  350 మంది మృతదేహాలకు

  ఢిల్లీలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం అటు కేంద్రం ఇటు ఢిల్లీ ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోందని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకోకుండా 350 మృతదేహాలు పేరుకునిపోయాయని చెప్పారు. వాటికి అంత్యక్రియలను నిర్వహించడానికి రెండురోజుల సమయం పడుతుందని అన్నారు. ఆ 350 కాకుండా.. కొత్త మృతదేహాలేవీ ప్రస్తుతం పెండింగ్‌లో లేవని, వాటికి ఎప్పటికప్పుడు అంత్యక్రియలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

  ఓపిక నశించడం వల్లే..

  ఓపిక నశించడం వల్లే..

  కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందకుండా నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం కొన్ని బాధాకర సంఘటనలు చోటు చేసుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఓపిక నశించిన కొంతమంది కాలి నడకన ప్రయాణం సాగించారని, అవి తమను బాధకు గురి చేశాయని అన్నారు. ఆ వెంటనే ప్రధానమంత్రి వారికోసం ప్రత్యేక రైళ్లను నడిపించారని చెప్పారు. ఇప్పటిదాకా కోటి 20 లక్షల మందిని వారి స్వస్థలాలకు చేర్చామని చెప్పారు. 63 లక్షల మంది వలస కార్మికులు 4594 రైలు సర్వీసులను వినియోగించుకున్నారని అన్నారు.

  ఇందిరాగాంధీ తరువాత

  ఇందిరాగాంధీ తరువాత

  ఇందిరాగాంధీ తరువాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వారెవరైనా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారా? అని అమిత్ షా ప్రశ్నించారు. పార్టీని సొంత కుటుంబంలా నడిపారని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మారిన ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రతి పౌరుడూ తమ జీవితాంతం గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు కరోనా పరిస్థితులను రాజకీయంగా మార్చుకోవడానికి అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు.

  English summary
  Let me make it clear. Under PM Modi's leadership, India is going to win both the wars: Home Minister Amit Shah on the fight against COVID19 and the tensions on the Line of Actual Control in Eastern Ladakh. The situation regarding bodies (of COVID19 victims) in Delhi was grim. Over 350 bodies were pending for last rites. We decided that within 2 days last rites of bodies will be done as per religion. Today, no body is left for last rites. Now last rituals are conducted same day
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more