వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా వారిద్దరే చేశారు..? అగ్రనేతలను విశ్వసించిన హస్తం పెద్దలు, పుట్టిముంచిన దిగ్గజాలు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమేంటీ..? సింధియా తిరుగుబాటు ఎగరేసిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమైంది. మహారాష్ట్ర, కర్ణాటక మాదిరిగా హై కమాండ్ తమ దూతలను ఎందుకు పంపించలేదు..? అక్కడ కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ లాంటి అగ్ర నేతలు ఉండటమే కారణమా..? ఇంచార్జీ బాధ్యతలు అప్పగించిన వారు ఎందుకు ప్రభావం చూపలేకపోయారు..? రెబల్ ఎమ్మెల్యేలను ఎందుకు తమ గూటికి తిప్పుకోలేకపోయారు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

వారిద్దరేనా..?

వారిద్దరేనా..?

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మధ్యప్రదేశ్ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వేగంగా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు రియాక్ట్ అయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు మధ్యప్రదేశ్‌లో రాజకీయ ఉద్దండులు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. వీరిద్దరూ పైకిమాత్రం బాగున్నా.. లోపల మాత్రం ఆధిపత్యం కోసం రగలిపోతూనే ఉంటారు. మధ్యప్రదేశ్ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరిశ్ రావాత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌ను పంపించిన ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడున్న ఇద్దరు అగ్రనేతలను వీరు సరిగా సమన్వయం చేసుకోలేకపోయారు. వారికి తగిన ఆదేశాలు జారీచేయకపోవడంలో ఇబ్బంది ఉండటంతో పుట్టి మునిగిపోయేందుకు దారితీసేందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

భోపాల్ టు ఢిల్లీ

భోపాల్ టు ఢిల్లీ

మధ్యప్రదేశ్‌లో సంక్షోభం పీక్‌కి స్టేజీకి చేరుతోన్న క్రమంలో ముకుల్ వాస్నిక్ వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ చేరుకున్నారు. అతని స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ బన్సాల్‌ను భోపాల్ తరలించింది. కానీ అతను కూడా వాస్నిక్ మాదిరిగా ఏమి చేయలేకపోయారు. మధ్యప్రదేశ్ సంక్షోభం, హైకమాండ్ ఎందుకు కలుగజేసుకోలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నకు గులాంనబీ ఆజాద్ బదులిచ్చారు. రాష్ట్రంలో ఇద్దరు దిగ్గజ నేతలు ఉన్నారని, పెద్దలు మిన్నకుండిపోయి ఉండొచ్చని ఇండైరెక్టుగా చెప్పారు. అందుకోసమే ఏకే ఆంటోని, అహ్మద్ పటేల్‌ను కూడా పంపించి ఉండలేరని తెలిపారు.

కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం..

కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం..


వాస్తవానికి గతేడాది జూలైలో కర్ణాటక సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ చురుగ్గా వ్యవహరించింది. గులాంనబీ ఆజాద్, హరిప్రసాద్‌ను బెంగళూరు పంపించింది. 2018లో మేఘాలయాకు కూడా అహ్మద్ పటేల్, కమల్‌నాథ్, సీపీ జోషి, ముకుల్ వాస్నిక్‌ను పంపించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో శివసేన, ఎన్సీపీతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గే రంగంలోకి దిగారు. కానీ భోపాల్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్ ఇంచార్జీ దీపక్ బాబారియా.. దిగ్గీ, కమల్‌నాథ్‌కు ఏం చెప్పే పరిస్థితి లేదు. పేరుకు మాత్రమే ఇంచార్జీగా కొనసాగారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను సొంతగూటికి తీసుకొచ్చేందుకు దీపక్ తన వంతు ప్రయత్నం చేశారు. వారి బంధువుల ద్వారా సొంతగూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు. తర్వాత దగ్గు, జ్వరంతో అహ్మదాబాద్‌లో ఇంటికే పరిమితమై... మధ్యప్రదేశ్ సంక్షోభానికి దూరంగా ఉన్నారు.

Recommended Video

కరోనా వైరస్ : Karnataka Shutdown To Continue For One More Week till March 31
మళ్లీ దిగ్గినేనా..?

మళ్లీ దిగ్గినేనా..?

రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయనప్పుడు వారు ఎందుకు పార్టీలోకి తిరిగి వస్తారని సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. సోనియాగాంధీ ఆదేశంతో సీనియర్ నేత రంగంలోకి దిగితే పరిస్థితి చేయిదాటి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. బెంగళూరు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు దిగ్విజయ్ సింగ్ వెళ్లడం సరికాదని.. దిగ్గీ, కమల్‌నాథ్ వైఖరితో విసుగెత్తి వెళ్లిన వారి వద్దకు వారినే ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఇది హైకమాండ్ చేసిన పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. కానీ రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు చివరి క్షణం వరకు తీవ్ర ప్రయత్నాలు చేశామని ఇంచార్జీ దీపక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటును బీజేపీ క్యాష్ చేసుకుందని పొలిటికల్ ఆనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Kamal Nath resigning as Chief Minister of Madhya Pradesh, the feeble crisis management efforts of the Congress high command have come under the spotlight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X