వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో యువతను పీడిస్తున్ననిరుద్యోగ సమస్య.. గణాంకాలు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

గణాంకాలు చూస్తే షాక్‌ .. పీడిస్తున్న నిరుద్యోగ సమస్య !

భారతదేశంలో యువతను పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతకు ఇది ప్రధాన సమస్యగా మారింది. డిసెంబర్ 2018లో ఈ నిరుద్యోగత ఎక్కువగా కనిపించిందని ఓ ఎంప్లాయిమెంట్ సర్వే తెలిపింది. ఈ సంఖ్యలు చూస్తే దాదాపు ఒక మిలియన్ మంది భారతీయ యువతలో ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ కూడా మందగించడం చూస్తే ఆ ప్రభావం ఉద్యోగాల పై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

యువతను పీడిస్తున్న నిరుద్యోగ సమస్య

యువతను పీడిస్తున్న నిరుద్యోగ సమస్య

నిరుద్యోగత, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతలో స్పష్టంగా కనిపిస్తోందని సర్వే పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇక ఈ సమస్య మూడు త్రైమాసికాల నుంచి 23.7శాతానికి పెరిగినట్లు తెలుస్తోంద. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ అంశం వెల్లడైంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ప్రతి మూడునెలలకు ఓసారి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఒక నివేదిక విడుదల చేస్తుంది. దీంతో పాటుగా ఏడాదికోసారి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నిరుద్యోగంపై గణాంకాలను విడుదల చేస్తుంది.

గణాంకాలు ఏమి చెబుతున్నాయి

గణాంకాలు ఏమి చెబుతున్నాయి

2017-18 సాధారణ గణాంకాలు చూస్తే పురుషుల్లో నిరుద్యోగ సమస్య 18.7 శాతానికి పెరిగిందని సర్వే చెబుతోంది. 2011-12లో ఇది 8.1శాతంగా ఉండేదని అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక మహిళల్లో 27.2శాతానికి పెరిగిందని అదే 2011-12లో ఇది 13.1శాతంగా ఉండేదని గణాంకాలు పేర్కొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 333 మిలియన్ మంది యువత ఉన్నారు. 2021 నాటికి ఈ సంఖ్య 367 మిలియన్ మార్కును తాకే అవకాశాలున్నట్లు అంచనా ఉండగా.. 2031 నాటికి 370 మిలియన్‌ తాకే అవకాశం కనిపిస్తోంది.

నిరుద్యోగంలో బీహార్ తొలిస్థానం

నిరుద్యోగంలో బీహార్ తొలిస్థానం

ఇక డిసెంబరు 2018 నాటికి బీహార్‌లో అత్యధికంగా అంటే 40.9 శాతం నిరుద్యోగ సమస్య కనిపించగా.. కేరళలో 37 శాతం, ఒడిషాలో 35.7 శాతం, గుజరాత్‌లో 9.6శాతంగా ఉన్నాయని లెక్కలు వెల్లడించాయి. ఈ లెక్కలతో వాస్తవ లెక్కలను పోల్చాలంటే చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈపీఎఫ్‌ఓలో నమోదైన వారి ద్వారానే ఎంతమంది యువత ఉద్యోగాలు పొందిందనేది లెక్కలు కడుతామని నిపుణులు చెబుతున్నారు.ఇక 2018 అక్టోబర్-డిసెంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో 1.4 మిలియన్ మంది పేర్లు నమోదు కాగా అందులో 1.1 మిలియన్ మంది 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు ఉన్నవారే అని తెలుస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతకు క్రమంగా వచ్చే వేతనాలు పురుషులకు నెలకు రూ. 17వేల నుంచి రూ.18000 ఉండగా మహిళలకు రూ.14వేల నుంచి 15వేలు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Nearly a quarter of young urban jobseekers remained unemployed during the December quarter of 2018, signalling widespread distress in the job market, according to the latest quarterly employment survey.The figures mean bad news for the 1 million Indians, who enter the workforce every month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X