బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగ సమస్య : కర్నాటకలో అత్యల్పం..ఎన్నికలకు వెళుతున్న హర్యానాలో అత్యధికం

|
Google Oneindia TeluguNews

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక యువత అల్లాడి పోతోంది. ఓ వైపు ప్రభుత్వం నుంచి ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం మరోవైపు ప్రైవేట్ సంస్థలు అనుభవం ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తుండటంతో అప్పుడే చదువుకుని కోట్ల ఆశలతో బయటకు వచ్చే గ్రాడ్యేయేట్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏదైనా చిన్న ఉద్యోగం తెచ్చుకుందామని మహా నగరాలకు వెళ్లి అక్కడ తమ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి నిరాశే మిగులుతోంది.

అనుభవం ఉన్నవారికే పట్టం

అనుభవం ఉన్నవారికే పట్టం

కర్నాటక రాష్ట్రం. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన నగరం. ఒకప్పుడు అక్కడికి ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తికి ఏదో ఒక జాబ్ లభించేది. ఉద్యోగాలు అంతలా ఇవ్వకున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటక రాష్ట్రం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. రెజ్యూమేలు పట్టుకుని కాళ్లరిగేలా తిరిగిన యువతకు ఇతర రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం కూడా దొరకడం లేదు. అంతలా అక్కడి పరిస్థితి తయారైంది. ఒక వేళ ఉద్యోగాలు ఉన్నా... అనుభవం ఉన్నవారికే అవి దక్కుతుండటంతో కొత్తగా బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్లకు మాత్రం నిరాశే కలుగుతోంది.

క్లిష్ట పరిస్థితుల్లోను కర్నాటకలో కనిపించని నిరుద్యోగ సమస్య

క్లిష్ట పరిస్థితుల్లోను కర్నాటకలో కనిపించని నిరుద్యోగ సమస్య

కర్నాటకలో మాత్రం నిరుద్యోగిత రేటు తగ్గింది. ఆగష్టునెలలో 0.7శాతం మాత్రమే నిరుద్యోగిత రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యంత తక్కువగా పేర్కొంది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ. పెద్ద రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పన విషయంలో కర్నాటక రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగష్టు నెలలో నిరుద్యోగిత సమస్య చాలా తగ్గినట్లు రిపోర్టు వెల్లడించింది. జనవరి 2017తో పోలిస్తే ప్రస్తుత నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో చాలా వరకు తగ్గింది. జనవరి 2017లో నిరుద్యోగిత సమస్య 6.7శాతంగా ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడిస్తోంది. ఆ సమయంలో ఐటీ బూమ్ ఉన్నందున రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 ఒక్క ఐటీ సెక్టార్‌లోనే 10 లక్షల మంది

ఒక్క ఐటీ సెక్టార్‌లోనే 10 లక్షల మంది

ఐటీకి బెంగళూరు నగరం హబ్‌గా మారడంతో ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇక రాష్ట్రంలో ఐటీ సేవలతో కూడిన సేవా రంగం కర్నాటక జీడీపీ బలోపేతానికి దోహదపడుతోంది. మూడింట రెండొంతులు ఐటీ సేవలు జీడీపీకి దోహదపడుతున్నాయి. ఇక బెంగళూరు తర్వాత నిరుద్యోగిత రేటు తక్కువగా గోవాలో ఉంది. ఆగష్టులో 3.7శాతంగా నమోదైంది.2017 ఫిబ్రవరిలో నిరుద్యోగ సమస్య గోవాలో 12.4శాతంగా ఉన్నింది. ఇక సిక్కింలో 2.1శాతం ఉండగా, మేఘాలయాలో 1.6శాతం, తెలంగాణలో 2.4 శాతంకు నిరుద్యోగ రేటు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

 హర్యానాలో నిరుద్యోగ సమస్య అత్యధికం

హర్యానాలో నిరుద్యోగ సమస్య అత్యధికం

ఇదిలా ఉంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్‌గా గుర్తింపు పొందిన హర్యానా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయింది. అసలే ఎన్నికలకు వెళుతున్న ఈ రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్య ఆగష్టు నెలకు 28.7శాతంగా ఉంది. గత రెండేళ్లలో ఈ సమస్య 1.8శాతం నుంచి 16 రెట్లు పెరిగింది. హర్యానాలో మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ లాంటి సంస్థలు ఉన్నాయి. రోజువారీ లెక్కన ఉద్యోగులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకునేవి. అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీగా పతనమవడంతో ఆ ప్రభావం ఉద్యోగాలపై పడింది.

English summary
Unemployment rate declined to 0.7% in Karnataka says a report. The poll bound state Haryana witnessed the highest unemployment rate for the month of August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X