వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను పీడిస్తున్న నిరుద్యోగ సమస్య..దీంతో పాటు మరికొన్ని: మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2020

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిరుద్యోగ సమస్య భారత్‌ను పీడిస్తోందంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ 2020 సర్వే ద్వారా వెల్లడైంది. ప్రముఖ జాతీయ పత్రిక మరియు కార్వీ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 2019 డిసెంబర్‌ నెలలో 19 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా పలు ఆసక్తి కర అంశాలు వెలుగు చూశాయి.

ఉగ్రవాదం అంతమయ్యే సమస్య కాదు..అమెరికా తరహాలో దాడులు చేయాలి: బిపిన్ రావత్ఉగ్రవాదం అంతమయ్యే సమస్య కాదు..అమెరికా తరహాలో దాడులు చేయాలి: బిపిన్ రావత్

 భారత్‌లో నిరుద్యోగ సమస్య

భారత్‌లో నిరుద్యోగ సమస్య

భారత్‌లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నట్లు దీనివల్ల ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత నిస్తేజంకు గురవుతున్నారని మూడ్ ఆఫ్ ది నేషన్ 2020 సర్వే ద్వారా వెల్లడైంది. మొత్తం 19 రాష్ట్రాల్లో 12,141 మందిని ఈ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. దేశంలో ఉద్యోగాల కొరతతో 32శాతం యువత తీవ్ర అసంతృప్తితో ఉందని సర్వే వెల్లడించింది. భారత్‌లో ఎలాంటి అంశాలు నిరాశకు గురిచేస్తాయన్న ప్రశ్నకు చాలామంది ఆర్థికపరమైన అంశాలనే ప్రస్తావించారు. ఆ తర్వాత 15 శాతం రైతులకు సంబంధించిన అంశాలు, 14శాతం మంది ధరల పెరుగుదల,10శాతం మంది ఆర్థిక మందగమనం గురించి మాట్లాడినట్లు సర్వే తెలిపింది.

 ఏడాదికి 10 మిలియన్ ఉద్యోగాలన్న అప్పటి ప్రధాని అభ్యర్థి మోడీ

ఏడాదికి 10 మిలియన్ ఉద్యోగాలన్న అప్పటి ప్రధాని అభ్యర్థి మోడీ

ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత్‌లోని నిరుద్యోగ రేటు 6.1శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగ కల్పన పై విడుదలైన తాజా గణాంకాల ప్రకారం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 5.3శాతంగా ఉండగా పట్టణాల్లో ఇది 7.8శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే 2014లో అప్పటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ తర ఎన్నికల ప్రచారం మొత్తం యువత ఉద్యోగాలపైనే మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏడాదికి 10 మిలియన్ ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రచారం చేశారు.

 నిర్మలా సీతారామన్ విఫలమయ్యారు

నిర్మలా సీతారామన్ విఫలమయ్యారు

నరేంద్ర మోడీ ప్రధానిగా అయ్యాక పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. అంతేకాదు ఉద్యోగ కల్పన విషయంలో ఆనాటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఇప్పుడు భిన్నంగా మారాయని చెబుతూ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. ఉద్యోగ కల్పన విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని దీన్ని ఎవరూ ఊహించలేకపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఇక మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పిస్తారని 47శాతం మంది భావించారు. ఇక ఆర్థికమందగమనంను డీల్ చేయడంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బాగా పనిచేశారని 39శాతం మంది భావించారు. 30శాతం మంది నిర్మలా సీతారామన్ విఫలమయ్యారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

English summary
As per the survey, conducted in December 2019, 32 per cent of 12,141 respondents interviewed in 19 states expressed worry and anxiety over lack of enough employment opportunities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X