వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని విపత్తు .. కరోనా , లాక్ డౌన్ గుర్తుగా పిల్లలకు పేర్లు పెట్టేస్తున్న ప్రజలు

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఏదైనా అసాధారణ సమయం దేశంలో నెలకొంటే ప్రజలు ఆ సందర్భాన్ని మర్చిపోకుండా పదిలం చేసుకుంటారు. ఇక సంబంధిత చారిత్రక ఘట్టం మంచిదైనా , చెడు అయినా సరే ఆ సమయంలో పుట్టిన పిల్లలకు అవే పేర్లు పెట్టి ఇక ఆ సీజన్ ఎప్పటికీ గుర్తుండేలా చేస్తారు. తాజాగా కరోనా సమయంలో పుట్టిన పిల్లలకు కరోనా అని, లాక్ డౌన్ సమయం కాబట్టి లాక్ డౌన్ అని పేర్లు పెడుతున్నారంటే మన వాళ్ళ పిచ్చి పీక్స్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది .

కరోనా ఎఫెక్ట్ ... రాములోరి కళ్యాణం టీవీల్లోనే... పూజలు ఇళ్లలోనే ..కరోనా ఎఫెక్ట్ ... రాములోరి కళ్యాణం టీవీల్లోనే... పూజలు ఇళ్లలోనే ..

ఏ సీజన్ ఉంటే ఆ పేర్లు పెట్టే ప్రజలు

ఏ సీజన్ ఉంటే ఆ పేర్లు పెట్టే ప్రజలు

సీజనల్ పేర్లకు మన దేశం పెట్టింది పేరు . తెలంగాణ ఉద్యమం సమయంలో పుట్టిన పిల్లలకు తెలంగాణ అని, సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో పుట్టినవారికి సమైక్య అని పేర్లు పెట్టడం విన్నాం. అంతే కాదు పుల్వామా దాడుల సమయంలో పాక్ ఇండియా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన సమయంలో పాక్ లో పట్టుబడిన ఇండియన్ యుద్ధ విమానాల పైలట్ అభినందన్ వర్ధమాన్ తిరిగి భారత గడ్డ మీద కాలు పెట్టిన యోధుడు . ఇక ఆ వీరుడి వీరత్వానికి గుర్తుగా అప్పుడు పుట్టిన పిల్లలకు అభినందన్ వర్ధమాన్ పేరు పెట్టటం మనందరికీ తెలుసు .

కరోనా, లాక్ డౌన్ సమయంలో పుట్టిన పిల్లలకు పేర్లు పెడుతున్న ప్రజలు

కరోనా, లాక్ డౌన్ సమయంలో పుట్టిన పిల్లలకు పేర్లు పెడుతున్న ప్రజలు

ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోన్న కరోనాను కూడా జీవితాంతం మర్చిపోలేము అంటున్నారు ప్రజలు. ఇప్పటి వరకు ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లోనూ ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా లాక్ డౌన్ ప్రకటించలేదు. అలాగే కరోనా అని కొత్త వైరస్ ప్రబలుతున్న వేళ కరోనా వ్యాప్తిని అరికట్టటానికి , కరోనా వైరస్ పై పోరాటం చెయ్యటానికి రంగంలోకి దిగాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు . ఆ తర్వాత లాక్ డౌన్ ప్రకటించడంతో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇదే సమయంలో ఆ లాక్ డౌన్ ను, కరోనాను కూడా మనోళ్లు పుట్టిన పిల్లలకు పేరుగా పెట్టారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
యూపీ బాబుకు లాక్ డౌన్ , గోరఖ్‌పూర్‌ పాపకు కరోనా అని పేర్లు

యూపీ బాబుకు లాక్ డౌన్ , గోరఖ్‌పూర్‌ పాపకు కరోనా అని పేర్లు

ఉత్తరప్రదేశ్ లో దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30వ తేదీన పుట్టిన బాబుకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్' అని పేరు పెట్టారు. ‘అతడు లాక్ డౌన్ సమయంలో పుట్టాడు.. కాబట్టి అందుకే మా బాబుకు ఆ పేరు పెట్టాం అని చెబుతున్నారు . మరోవైపు .. మార్చి 22న గోరఖ్‌పూర్‌లో పుట్టిన ఆడపిల్లకు ‘కరోనా' అని పేరు పెట్టినట్టు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ తెలిపారు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని అందుకే బాలికకు కరోనా అని పేరు పెట్టినట్టు తాను భావిస్తున్నట్టు చెప్పాడు నితీష్. మొత్తానికి ఏ సీజన్ లో ఆ పేర్లు పెట్టడం మనవాళ్లకు రివాజే కానీ కరోనా అనే పేరు పెట్టి పిలిస్తే జనాలు భయపడిపోరూ.. ఏది ఏమైనా ఎవరి పిచ్చి వాళ్ళది .

English summary
A new born baby boy who was born on March 30 in Deoria district of Uttar Pradesh. He was born at the time of the lockdown. so the parents keep his name as lock down . On the other hand, a girl born in Gorakhpur on March 22 named the girl as corona, said the girl's uncle Nitish Tripathi. Nitish said that the girl remembers the fight against the pandemic called Corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X