• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Zomato: జొమాటో బాయ్‌కి ఊహించని గిఫ్ట్... ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండడు...

|

చిన్నదో పెద్దదో.. ఏదో ఒక పనిచేసుకుంటూ సొంత కాళ్ల మీద నిలబడగలగాలి. చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు కష్టానికి తగ్గ గుర్తింపు తప్పక దక్కుతుంది. ఆ భరోసానిచ్చేందుకు దారి దీపాల్లాంటి వ్యక్తులు ఎక్కడో చోట తారసపడుతారు. హైదరాబాద్‌కు చెందిన అకీల్‌ అనే ఫుడ్ డెలివరీ బాయ్‌కి ఎదురైన అనుభవమే ఇందుకు మంచి ఉదాహరణ.

ఏడుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి అతనొక్కడే సంపాదించే ఆధారం. కుటుంబాన్ని పోషించడం కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. కనీసం అతనికి బైక్ కూడా లేదు. సైకిల్‌ పైనే ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పటికీ... ఎప్పుడూ ఆలస్యం కాకుండా చూసుకుంటాడు. అతని కష్టానికి,నిజాయితీకి గత శుక్రవారం(జూన్ 18) ఊహించని ఫలితం దక్కింది.

ఆర్డర్ బుక్ చేసిన ముకేశ్...

ఆర్డర్ బుక్ చేసిన ముకేశ్...

హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన రాబిన్ ముకేశ్(20) అనే యువకుడు సోమవారం రాత్రి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. నీలోఫర్‌లోని లక్డీ కా పూల్ సమీపంలోని ఓ హోటల్ నుంచి ఆర్డర్ తీసుకుని కింగ్ కోఠిలో దాన్ని డెలివరీ చేయాలి. జొమాటోకి చెందిన మహమ్మద్ అకీల్(21) అనే యువకుడికి ఆ ఆర్డర్ వెళ్లింది. ఆర్డర్ బుక్ అయిన సమయంలో అతను మెహిదీపట్నంలో ఉన్నాడు.ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో ఆర్డర్ వచ్చేసరికి ఆలస్యమవుతుందని ముకేశ్ భావించాడు.

అంత వర్షంలోనూ 20 నిమిషాల్లోనే....

అంత వర్షంలోనూ 20 నిమిషాల్లోనే....

కానీ కేవలం 20 నిమిషాల్లోనే మహమ్మద్ అకీల్ కింగ్ కోఠిలోని రాబిన్ ముకేశ్ ఇంటికి చేరుకుని ఆర్డర్ డెలివరీ చేశాడు. అంత వర్షంలో 9కి.మీ దూరం కేవలం 20 నిమిషాల్లో చేరుకోవడం ముకేశ్‌ను ఆశ్చర్యపరిచింది. ఆర్డర్ తీసుకుని అకీల్‌ను పంపించేయకుండా అతనికి టీ ఆఫర్ చేశాడు. ఆ సమయంలో అతని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తాను తలాబ్ కట్ట ప్రాంతంలో నివాసం ఉంటానని... బీటెక్ చదవుతున్నానని అకీల్ చెప్పాడు. ఏడుగురు సభ్యులు ఉన్న తన కుటుంబం తన ఒక్కడి సంపాదన పైనే ఆధారపడి ఉందని చెప్పాడు.

సోషల్ మీడియాలో పోస్ట్...

లాక్‌డౌన్‌కి ముందు ఒక చోట పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడినని... లాక్‌డౌన్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేస్తున్నానని చెప్పాడు. బైక్ కొనేంత స్తోమత లేకపోవడంతో ఎంత దూరమైనా సైకిల్‌ పైనే వెళ్లి డెలివరీ చేస్తానని తెలిపాడు. తనకొచ్చే రూ.8వేల వేతనం ఇంటి ఖర్చులకే సరిపోతాయని చెప్పాడు. అకీల్ గురించి తెలిశాక ముకేశ్ చలించిపోయాడు. అతని కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. వెంటనే సోషల్ మీడియాలో అకీల్ గురించి పోస్ట్ చేసి తోచిన సాయం చేయాలని కోరాడు.

  Hyderabad : వెలవెలబోతున్న Ameerpet Hostels.. ఇదీ దుస్థితి | Exclusive
  ఎట్టకేలకు అకీల్‌కు టూ వీలర్...

  ఎట్టకేలకు అకీల్‌కు టూ వీలర్...

  హెల్పింగ్ హ్యూమన్స్ హైదరాబాద్,ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్&ట్రావెల్ క్లబ్ లాంటి సోషల్ మీడియా గ్రూప్స్ కూడా అకీల్ కోసం క్యాంపెయిన్ నిర్వహించాయి. దీంతో తక్కువ వ్యవధిలోనే రూ.73వేల విరాళం లభించింది. అందులో నుంచి రూ.65వేలతో ముకేశ్ అకీల్‌కు శుక్రవారం(జూన్ 18) టీవీఎస్ ఎక్స్‌ఎల్ టూ వీలర్ కొనిచ్చాడు. మిగతా డబ్బును అతని చదువుకయ్యే ఖర్చల కోసం ఇచ్చాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల హైదరాబాదీలు చలించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Robin Mukesh, a resident of Hyderabad’s King Koti, placed an order on Zomato on Monday night. When the order was delivered 20 minutes later, Mukesh was surprised to see that the delivery executive had come on a cycle. Mohd Aqeel Ahmed, who has been working as a Zomato delivery executive for a year now, had ridden around nine kilometres in 20 minutes.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X