వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలు అడ్డొచ్చె: సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేక.. ప్రత్యక్ష ప్రసారంలో వీక్షణ: మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Solar Eclipse 2019: PM Modi Reacts To His Meme picture on Solar Eclipse | Oneindia Telugu

న్యూఢిల్లీ: అంతరిక్ష అద్భుతంగా పరిగణించే గ్రహణాలను ప్రత్యక్షంగా తిలకించాలనుకునే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి కూడా చోటు చేసుకోవడం కష్టంగా భావించే సౌర గ్రహణ కాలం, పట్టువిడుపులను ఉత్సాహంగా తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం రెడీ అయిపోయారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను తన నివాసానికి పిలిపించుకున్నారు. ఫిల్మ్ తో తయారు చేసిన కళ్లద్దాలను సిద్ధం చేసుకున్నారు. మేఘాలు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి.

సంపూర్ణ సూర్యగ్రహణం .. చాలా పవర్ఫుల్ .. ఎలా పడితే అలా చూస్తే యమా డేంజర్ .. ఎందుకంటేసంపూర్ణ సూర్యగ్రహణం .. చాలా పవర్ఫుల్ .. ఎలా పడితే అలా చూస్తే యమా డేంజర్ .. ఎందుకంటే

ఆకాశం మేఘావృతం కావడం వల్ల ఆయన సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. ఒక్క ప్రధానమంత్రే కాదు.. దేశ రాజధానివాసులు ఎవరూ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అయినప్పటికీ- ప్రత్యక్ష ప్రసారం ద్వారా నరేంద్ర మోడీ సూర్య గ్రహణాన్ని తిలకించారు. కేరళలోని కోజికోడ్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. దేశం మొత్తం మీద కోజికోడ్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ ను తిలకించే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేశారు.

Unfortunately, I could not see the Sun due to cloud cover, says PM Narendra Modi

దురదృష్టవశావత్తూ తాను సూర్య గ్రహణాన్ని తాను ప్రత్యక్షంగా తిలకించలేకపోతున్నానంటూ నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. కొన్ని ఫొటోలను ఆయన దీనికి జత చేశారు. ఆకాశం మేఘావృతమై ఉన్నందున సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నానని, కేరళలోని కోజికోడ్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో చూడగలుగుతున్నానని చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలకు తాను అతీతుడినేమీ కాదని, సూర్యగ్రహణాన్ని వీక్షించేలానే ఉత్సాహం తనలోనూ ఉందని అన్నారు.

న్యూఢిల్లీ మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా మారిపోవడమే దీనికి కారణం. ఢిల్లీలో శీతాకాలం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. కొద్దిరోజులుగా అక్కడి ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి నమోదవుతోంది. గురువారం తెల్లవారు జాము నుంచీ ఇదే పరిస్థితి ఏర్పడింది. మేఘాలు దట్టంగా అలుముకోవడం, మంచు కమ్ముకునిపోవడం వల్ల సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. ఫలితంగా- ఢిల్లీవాసులు టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలను ఆశ్రయించారు.

English summary
PM Modi on twitter mentioned how he missed witnessing eclipse due to cloud. "Like many Indians, I was enthusiastic about solareclipse2019. Unfortunately, I could not see the Sun due to cloud cover but I did catch glimpses of the eclipse in Kozhikode and other parts on live stream. Also enriched my knowledge on the subject by interacting with experts", wrote PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X