వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఫోన్‌పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్‌కు సింబల్‌గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్ ఉండాల్సిందే. బడాబాబులైతే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లేనిదే కాలు బయటకు పెట్టరు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఐఫోన్‌కు కస్టమరే. అయితే కొత్తగా వచ్చిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లపై హోమ్ బటన్ లేకపోవడంతో ట్రంప్‌కు ఎక్కడా లేని ఆగ్రహం వచ్చింది. దీంతో ఆయన ఏంచేశారో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఐఫోన్ వినియోగిస్తారు. దీని కొత్త మోడల్ మార్కెట్‌లోకి రాగేనే కొన్నట్లున్నారు. కొత్త ఫోన్ కొన్నారన్న ఆనందం కొన్ని నిమిషాల పాటు కూడా లేదు... అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహం వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే కొత్తగా వచ్చిన ఐఫోన్‌ మోడల్స్‌పై హోం బటన్ లేదట. హోంబటన్ ఉంటేనే చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతారట అగ్రరాజ్యపు అధినేత. కొత్త మోడల్ ఫోన్ పై హోంబటన్ కనిపించకపోవడంతో వెంటనే ట్విటర్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ట్వీట్ చేశారు.

Unhappy over IPhone Trump tweets to Apple CEO TIM

2007లో ఆ సంస్థ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ విడుదల చేసిన ఐఫోన్ నుంచి మొన్నటి వరకు వచ్చిన అన్ని ఐఫోన్లపై హోంబటన్ ఉండేది. ఒక్క ఐఫోన్ ఎక్స్ వెర్షన్స్‌కు మాత్రమే స్వైప్ వేరియంట్‌ను తీసుకువచ్చింది.అయితే పాత ఐఫోన్లకు మాత్రమే హోంబటన్ వస్తోంది. ఇక విషయానికొస్తే ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్‌ను వినియోగిస్తున్నారు. దానికి హోంబటన్ ఉంటుంది. అయితే తాజాగా కొత్త ఫోన్ ప్రభుత్వం ఇవ్వడంతో హోంబటన్ లేదే అని ఆగ్రహం వ్యక్తం చేశారట. స్వైప్‌ కంటే హోంబటన్‌ ఉంటేనే బాగుండేదని టిమ్‌కు ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది తనను ఎంతలా అసంతృప్తికి గురిచేసిందంటే తన ట్వీట్‌ను తిరిగి తానే రీట్వీట్ చేసుకున్నారు.

గతంలో కూడా ట్రంప్ యాపిల్ ఐఫోన్‌ను ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు చేశారు. స్క్రీన్ పెద్దదిగా ఉండేలా ఐఫోన్‌ను లాంచ్ చేయాలని లేదంటే బిజినెస్ కోల్పోతారంటూ ట్వీట్ చేశారు. ఐఫోన్ వ్యాపారంను శాంసంగ్ కొల్లగొడుతోందని చెప్పారు.

English summary
US President Donald Trump is missing the home button on the newer iPhone models and he is not happy about it. To express his displeasure, he took to Twitter earlier today, like he does for most things, and called out Apple CEO Tim Cook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X