వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి...!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయంగా మరోసారి చర్చకు తెరలేసింది. గత కొద్ది రోజులుగా కశ్మీర్ ‌లో కొనసాగుతున్న సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీరీల ఇంటర్‌నెట్ కమ్యూనికేషన్లపై నిబంధనలు విధించడంతో పాటు శాంతియుత సమావేశాలను నిషేధించడం, మరియు స్థానిక రాజకీయ నాయకులను, కార్యకర్తలను నిర్భంధించడంపై యూఎన్ మానవ హక్కుల మండలి అధ్యక్షురాలు మిచెల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ముద్దుకు నిరాకరించిన యువతిని చంపిన యువకుడు...!ముద్దుకు నిరాకరించిన యువతిని చంపిన యువకుడు...!

అంతర్జాతీయ మానవ హక్కుల మండలి 42వ సమావేశం జనీవాలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అధ్యక్షురాలు మిచెల్లీ మాట్లాడారు. ఈనేపథ్యంలోనే ఆమే కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా కశ్మీర్‌లో మానవ హక్కులను భారత దేశంతో పాటు, పాకిస్థాన్ దేశాలు కాపాడాలని కోరుతున్నానని చెప్పారు. మరోవైపు కశ్మీర్‌లో నెలకొన్న నిర్భంధాలతో పాటు కర్ఫ్యూను ఎత్తి వేయాలని ఆమే భారత్‌కు విజ్ఞప్తి చేశారు. కశ్మీరీల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఏ నిర్ణయాలైనా తీసుకునేటప్పుడు వారిని పూర్తిగా భాగస్వామ్యులు చేయడం చాల ముఖ్యమని ఆమే ఆన్నారు. నిర్భంధంలో ఉన్న వారితోపాటు ప్రజలకు ప్రాధమిక హక్కులను కల్పించడం అత్యంత అవసరమని సూచించారు.

UNHRC deeply concerned about human rights of Kashmiris,

కాగా గత ముప్పై 36 రోజులుగా కశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.అయితే ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో దశల వారిగా ఆంక్షలను సడలింపు చేస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో కర్ఫూను తొలగించడంతోపాటు సాధరణ పరిస్థితులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

English summary
With the lockdown in Kashmir now completing 35 days, India is facing more questions from the international community. Today, in her opening statement in Geneva at the 42nd session of the UN Human Rights Council,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X