వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో ఏకరీతి స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు: ఇవి ఎలా ఉంటాయంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ దేశమంతా ఒకేలా ఉండనుంది. డ్రైవింగ్ లైసెన్స్ డిజైన్, రంగు అంతా ఒకేలా కనిపించనుంది. 1 జూలై 2019 తర్వాత జారీ చేయబడే కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (ఆర్సీ) ఏకరీతిలో ఉండనున్నాయి. రంగు, డిజైన్‌లతో పాటు ఒకే విధమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి.

ఈ డ్రైవింగ్ లైసెన్స్‌లో మైక్రో చిప్స్, దానికి తోడు క్యూఆర్ కోడ్ ఉండనున్నాయి. ఈ కార్డ్స్ సమీప కమ్యూనికేషన్స్‌తో (ఎన్‌ఎఫ్‌సీ) అనుసంధానించబడతాయి. ఈ స్మార్ట్ కార్డు పైన అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. దీంతో పాటు డ్రైవర్ ప్రతిభ గురించి, అలాగే వెంటనే ట్రాఫిక్ యాక్సెస్ చేసే విధంగా ఈ స్మార్ట్ డ్రైవింగ్, ఆర్సీ ఉంటుంది. అంతేకాదు, వికలాంగుల కోసం ఏదైనా వాహనం ప్రత్యేకంగా ఉంటే దానిని కూడా పొందుపరిచే విధంగా ఉంటుంది.

ఈ ఆర్సీ వాహనం నుంచి వెలువడే ఉద్గారాల వివరాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా పొల్యూషన్ కంట్రోల్ వివరాలను కూడా గుర్తించవచ్చు.

vUniform smart DLs, RCs across India from July next year

ఒకేరూపు కలిగిన ఈ కొత్త డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల కోసం ఇప్పటికే యూనియన్ రోడ్డు ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకునే సమయంలో ఈ కొత్త వాటిని ఇవ్వనున్నారు. అలాగే వాహనాలను రీ రిజిస్ట్రర్ చేయించుకున్నప్పుడు కొత్త ఆర్సీలను ఇస్తారు.

ఈ కొత్త కార్డుల ద్వారా ఎన్‌ఫోర్సుమెంట్ పర్సనల్, ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్ గురించి సులభంగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త కార్డుల ద్వారా సంబంధిత వాహనం లేదా డ్రైవర్ గురించి, వాహనం లేదా డ్రైవర్ గురించిన గత విషయాలను గుర్తించవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు సెంటర్ డేటాబేస్ ఆఫ్ వాహన్ (వెహికిల్స్) అండ్ సారథి (డ్రైవర్)లో ఉంటాయి. ఈ వివరాలతో కూడిన యూఆర్ఎల్‌కు నేరుగా యాక్సెస్ ఉంటుంది.

English summary
Driving licences across India will soon have similar look, colour and design, irrespective of the state of issuance. New driving licences (DLs) and vehicle registration certificates (RCs) issued after July 1, 2019 will be uniform in look, colour and design, and will have the same security features, a media report said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X